Snakes: వామ్మో..ఇంట్లో బైట పడ్డ 32 పాము పిల్లలు.. షాకింగ్ వీడియో వైరల్..
Snakes viral: భద్రాద్రి కొత్తగూడెంలోని ఒక ఇంట్లో ఏకంగా 32 పాములు బైటపడ్డాయి. దీంతో ఇంట్లో వాళ్లంతా భయంతో బైటకు పరుగులు పెట్టారు. పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
At least 32 snakes found inside house in kothagudem video viral: సాధారణంగా చాలా మంది పాములంటే భయంతో వణికిపోతుంటారు. కొందరైతే పాములు పొరపాటున ఎక్కడైన కన్పిస్తే ఆ ప్రదేశాలకు మరల అస్సలు వెళ్లరు. మరికొందరు మాత్రం పాములతో సరదగా ఆడుకుంటారు. ఇటీవల కొందరు పాములతో ఆడుకున్న అనేక వీడియోలు వార్తలలో నిలిచాయి. కొన్నిసార్లు పాములు కన్పిస్తే, వాటిని పట్టేవారికి సమాచారం ఇస్తారు. పాములకు అస్సలు ఆపద తలపెట్టరు. పాములకు ఆపద కల్గజేస్తే కాలసర్పదోషం వస్తుందని చాలా మంది భావిస్తారు. దీని వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.
పెళ్లి విషయంలోను, కెరియర్ లోను సెటిల్ లోను అనేక అవాంతరాలు వస్తాయి. ఈ క్రమంలోనే వర్షాకాలం నేపథ్యంలో పాముల అలజడి ఎక్కువగా ఉంటుంది. పొలాల్లో,చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు కన్పిస్తుంటాయి. పాములు కాటు ఘటనలు కూడా ఈ సీజన్ లలో ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి.
పూర్తివివరాలు..
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జిల్ కొత్తగూడెం నెహ్రు బస్తీలో ఏరియాలో రాజు ఉంటున్నాడు. అతను ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు.ఈ నేపథ్యంలో.. ఓ వ్యక్తి ఇంటి గోడ ఉన్న పాము పిల్లలను ఇంట్లో వాళ్లు గమనించారు. వెంటనే భయపడిపోయిన బైటకు వచ్చేశారు. స్నేక్ క్యాచర్ దత్తు బృందానికి సమాచారం ఇచ్చారు.
Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..
అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీ వారు పాములను పట్టడానికి గంటల పాటు శ్రమించారు. కొన్ని గంటల పాటు శ్రమించి, పెద్ద పాము తో పాటు మొత్తం 32 నాగు పాము పిల్లలను చాకచక్యంగా పట్టుకున్నారు. స్నేక్ సొసైటీ వాళ్లు..పాములను పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. దీంతో కుటుంబ సభ్యులకు పెను ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి