Awake craniotomy: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అరుదైన బ్రెయిన్ సర్జరీ.. పేషెంట్ సినిమా చూస్తుండగా ఆపరేషన్ చేసిన వైద్యులు
Awake craniotomy in Secunderabad Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో తొలిసారి `అవేక్ క్రేనియోటమీ` సర్జరీ నిర్వహించారు. పేషెంట్‌కు మత్తు మందు ఇవ్వకుండా స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ చేశారు.
Awake craniotomy in Secunderabad Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ పేషెంట్‌కి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. పేషెంట్‌కు మత్తు మందు ఇవ్వకుండా స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ చేశారు. రెండు గంటల పాటు సర్జరీ నిర్వహించి మెదడులో కణితిని తొలగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 60 ఏళ్ల మహిళకు గురువారం విజయవంతంగా ఈ సర్జరీ నిర్వహించారు.
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళ ఇటీవల గాంధీ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఎక్స్‌రే రిపోర్టుల్లో ఆమె మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ కణితిని తొలగించాలంటే పేషెంట్ స్పృహలో ఉండగానే సర్జరీ చేయాలి. లేనిపక్షంలో బ్రెయిన్ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని వైద్యులు పేషెంట్‌తో చెప్పి సర్జరీ కోసం సంసిద్ధం చేశారు.
గురువారం (ఆగస్టు 26) సర్జరీ సమయంలో పేషెంట్ చేతికి ఒక ట్యాబ్ ఇచ్చారు. అందులో పేషెంట్ సినిమా చూస్తుండగా వైద్యులు సర్జరీ నిర్వహించారు. రెండు గంటల పాటు శ్రమించి మొత్తానికి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. అవేక్ క్రేనియోటమీగా పిలిచే ఈ సర్జరీ గాంధీ ఆసుపత్రిలో ఇదే తొలిసారి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ప్రస్తుతం ఆ పేషెంట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెను డిశ్చార్జి చేయనున్నట్లు సమాచారం.
Also Read: Fact Check: కేంద్రం 4 శాతం డీఏ పెంపు ప్రకటించిందా.. ఆ సర్క్యులర్‌లో నిజమెంత...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook