బాలకృష్ణ, విజయశాంతి ..వెండితెరపై వీరిద్దరిదీ ఎంత సూపర్ హిట్ జంటోనో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  చాలా ఏళ్ళ తర్వాత ఈ జోడి మళ్లీ  తెరపైకి కనిపించనుంది. అయితే ఈ సారి సినిమా తెరపై కాదండోయ్.. పొలిటికల్ తెరపై...తెలంగాణ ఎన్నికల్లో ఇరువురు కలిసి ప్రచారం చేయనున్నారట. విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..


 విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగుతుండగా.. తెలంగాణలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణ టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరువురు వేర్వేరు పార్టీలకు చెందిన వారైనప్పటికీ మహాకూటమి కారణంగా ఇరువురు కలిసి ప్రచారం చేయనున్నారట. చాలా రోజుల తరువాత వీరిద్దరూ కలసి ఓ కూటమి తరఫున పనిచేస్తుండటం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా వీరి ప్రచారం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.