Balapur Ganesh laddu:మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ, ఏపీ సీఎం జగన్‌కు కానుకగా ఇస్తామన్న ఎమ్మెల్సీ, కొలను కుటుంబీకుల రికార్డు
Balapur Ganesh laddu auction : ఈ లడ్డూను ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బాలాపూర్ ప్రజల సమక్షంలోనే ప్రకటించారు. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన ఈ లడ్డూ వేలంపాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Balapur Ganesh laddu auctioned for Rs 18.90 lakh: బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ముగిసింది. మరోసారి బాలాపూర్ గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. వేలంపాట పోటాపోటీగా సాగింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో (MLC Ramesh Yadav) కలిసి నాదర్‌గుల్ వాసి మర్రి శశాంక్‌రెడ్డి (Marri Shashank Reddy) బాలాపూర్ గణేశుడి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. ఇక, ఈ లడ్డూను ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan Mohan Reddy) కానుకగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బాలాపూర్ ప్రజల సమక్షంలోనే ప్రకటించారు. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన ఈ లడ్డూ వేలంపాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
బాలాపూర్ గణేశుడి లడ్డూ సొంతం చేసుకుంటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే ఈ లడ్డూ కోసం భక్తులు ఎదురుచూస్తారు. ఎంత ధరైనా వెచ్చిస్తారు. ఎన్నో ఏళ్లుగా లడ్డూవేలంపాటలో ప్రత్యేకతను చాటుకుంటుంది బాలాపూర్ గణేశుడి లడ్డూ. కొవిడ్ కారణంగా గతేడాది వేలంపాట జరగలేదు.
450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలంపాట
ఇక 2019లో బాలాపూర్ లడ్డూను కొలను రాంరెడ్డి (Kolanu Ramreddy) రూ.17.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాల్సి ఉంటుంది .1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలంపాట..వందలు వేలు దాటి..రికార్డుస్థాయిలో లక్షలు పలుకుతోంది. వందలాది మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య ప్రతి ఏటా వేలంపాట ఉత్కంఠగా కొనసాగుతుంది.
Also Read : India Book Of Record: రెండేళ్ల తెలంగాణ బుడతడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం.. ఎలా దక్కిందో తెలుసా?
కొలను కుటుంబీకుల రికార్డు
2019లో రికార్డుస్థాయిలో బాలాపూర్ లడ్డూ వేలం పాటలో 17లక్షల 60వేల రూపాయలకు కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నారు. 2016లో మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14లక్షల 65 వేలకు దక్కించుకున్నారు. 2017లో తిరుపతిరెడ్డి 15లక్షల 60వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2018లో శ్రీనివాస్‌గుప్తా 16లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. అత్యధికంగా బాలాపూర్‌కు చెందిన కొలను కుటుంబీకులు లడ్డూను వేలంపాటలో 9 సార్లు దక్కించుకున్నారు. కానీ ఈ సారి మాత్రం వారు బాలాపూర్ గణేశుడి లడ్డూను (Balapur Ganesh laddu)సొంతం చేసుకోలేకపోయారు.
Also Read : Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో రామ్‌చరణ్.. హౌజ్‌మేట్స్‌ను సెట్ చేస్తానన్న నాగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి