India Book Of Record: రెండేళ్ల తెలంగాణ బుడతడికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం.. ఎలా దక్కిందో తెలుసా?

karimnagar boy  vedansh sai : టాలెంట్‌లో చిచ్చరపిడుగు ఈ బుడతడు. కరీంనగర్‌ సప్తగిరికాలనీకి చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్‌ సాయిరెడ్డికి మంచి టాలెంట్‌ ఉంది. ఈ చిన్నోడి ప్రతిభను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు వారు ప్రశంసిస్తూ కార్డు, మెడల్‌ను అందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2021, 10:31 AM IST
  • టాలెంట్‌తో అబ్బురపరుస్తున్న కరీంనగర్‌కు చెందిన వేదాంశ్‌ సాయిరెడ్డి
  • రెండేళ్ల వయస్సులోనే మంచి ప్రతిభ చూపిస్తున్న చిన్నోడు
  • అబ్బురపరుస్తున్న బుడతడు
 India Book Of Record: రెండేళ్ల తెలంగాణ బుడతడికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం.. ఎలా దక్కిందో తెలుసా?

Telangana 2Year-Old karimnagar boy vedansh reddy enters India Book Of Records : బోసి నవ్వులతో అందరి ఆకట్టుకునే ఆ చిన్నారి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నారు. వయస్సులో చాలా చిన్నోడు.. కానీ టాలెంట్‌లో చిచ్చరపిడుగు ఈ బుడతడు. కరీంనగర్‌ సప్తగిరికాలనీకి చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్‌ సాయిరెడ్డికి  ( vedansh sai reddy) మంచి టాలెంట్‌ ఉంది. ఈ చిన్నోడి ప్రతిభను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు (India Book Of Records) వారు ప్రశంసిస్తూ కార్డు, మెడల్‌ను అందించారు. 

Also Read : H1B Visa: హెచ్ 1 బి వీసాల జారీలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు

అబ్బురపరుస్తున్న చిన్నారి

ఏడు పక్షులు, ఇరవై నాలుగు జంతువులు, ఇరవై రెండు శరీర భాగాలు, పది ఆహారపు వస్తువులు, 13 పండ్లు, రెండు కూరగాయలు, నంబర్స్‌, 8 జీకే ప్రశ్నలకు ఠకీఠకీమని జవాబులు చెప్పాడు ఈ చిన్నోడు. అందుకే ఈ బుడతడికి ఈ ఘనత దక్కింది. అలాగే 21 రకాల అభినయాన్ని (21 types of performances) పలికించగలడు. వరల్డ్ మ్యాప్‌ , ఆకారాల పజిల్స్‌ పూర్తి చేయగలడు ఈ బాబు. పేపర్‌ కప్పులతో పిరమిడ్‌ తయారు చేస్తాడు. వేదాంశ్‌ సాయిరెడ్డి వయస్సు ప్రస్తుతం రెండు సంవత్సరాల మూడు నెలలు. ఇంత చిన్న వయస్సులో ఇవన్నీ చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.

Also Read : LIC Special Campaign: మీ ఎల్ఐసీ గతంలో రద్దయిందా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x