Balapur Laddu Auction Rules: వినాయక చవితి వేడుకలకు తెలంగాణ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఖైరతాబాద్‌ పెద్ద వినాయకుడితోపాటు లడ్డూ వేలంతో యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించే వినాయకుడు బాలాపూర్‌ గణేశ్‌. లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్‌ వినాయక మండపం నిర్వాహకులు తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లడ్డూ వేలానికి సంబంధించిన నియమ నిబంధనలను మార్చివేశారు. ఇంతకీ రూల్స్‌ ఏం మార్చారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Yagam: మాజీ సీఎం కేసీఆర్‌ యాగం.. తన గారాలపట్టీ కల్వకుంట్ల కవిత కోసమే?


 


బాలాపూర్ లడ్డూ చరిత్ర
బాలాపూర్‌లో ప్రతిష్టించే వినాయకుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశం దృష్టిని ఆకర్షించే హైదరాబాద్‌ వినాయక నిమజ్జన శోభాయాత్ర బాలాపూర్‌ గణేశ్‌తోనే ప్రారంభమవుతుంది. ఇక ఇక్కడి లడ్డూకు ఎంతో ఘన చరిత్ర ఉంది. బాలాపూర్‌లో మొదట 1980లో గణేశుడిని ప్రతిష్టించారు. పద్నాలుగేళ్ల తర్వాత అంటే 1994లో లడ్డూ వేలం నిర్వహించడం ప్రారంభించారు. తొలి వేలంలో రూ.450కి కొలను మోహన్‌ రెడ్డి దక్కించుకున్నాడు. ఆ లడ్డూను కుటుంబసభ్యులకు పంచడంతోపాటు వ్యవసాయ పొలాల్లో చల్లారు. ఆ లడ్డూను పొందిన వారందరికీ బాగా కలసొచ్చింది. లడ్డూ ప్రభావమేనని భావించి మరుసటి ఏడాది అంటే 1995లో మళ్లీ వేలంలో రూ.4,500కు మోహన్‌ రెడ్డి గెలుచుకున్నారు. ఆ ఏడాది కూడా ఆయనకు అన్ని విధాల కలిసి రావడంతో ఆ వార్త హైదరాబాద్‌లో వ్యాప్తి చెందింది. ఇక అప్పటి నుంచి లడ్డూ వేలానికి భారీగా డిమాండ్‌ వస్తోంది.


Also Read: Revanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం 'పెద్దన్న' సాయం చేయాలి


 


తీవ్ర పోటీ...
అయితే వేలంలో కేవలం బాలాపూర్‌ గ్రామస్తులకే అవకాశం ఉండేది. తర్వాత తర్వాత బయటి వ్యక్తులకు కూడా వేలంలో పాల్గొనే అవకాశం లభించింది. ఇప్పుడు ఎక్కడి నుంచైనా లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే తీవ్ర పోటీ ఏర్పడుతుండంతో బాలాపూర్‌ మండపం నిర్వాహకులు కీలక మార్పులు చేశారు. వేలంలో ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వేలం డిపాజిట్‌ సొమ్మును ముందే తీసుకోవాలని నిర్ణయించారు. గతేడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డూ వేలం ధర పలికింది.


నిబంధనలు మార్పు
ఈసారి నిర్వహించే వేలంలో ఒక రోజు ముందుగానే రూ.27 లక్షలను డిపాజిట్‌ చేయాల్సి ఉంది. వేలంలో పాల్గొనాలనుకునే వారు ముందు రోజే తమ పేరు నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా గతేడాది పలికిన వేలం ధర రూ.27 లక్షలను డిపాజిట్‌ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. వేలం పొందాక డబ్బులు చెల్లించడంలో వేలం దక్కిన వారు తాత్సారం చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రోజురోజుకు పెరుగుతున్న బాలాపూర్‌ లడ్డూ వేలం ధర ఈసారి ఎంత పలుకుతుందనేది ఆసక్తిగా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.