Balapur Laddu: బాలాపూర్ లడ్డూ గెలిస్తే కొంగు బంగారమే! వేలం విజేతల జాబితా ఇదే!
Balapur Laddu Auction Rules: వేలంతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బాలాపూర్ లడ్డూ వందల నుంచి ప్రారంభమై నేడు లక్షల్లో పలుకుతోంది. విజేతల జాబితా ఇలా ఉంది.
Balapur Laddu Auction Winners List: వినాయక చవితి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వాటిలో ఖైరతాబాద్ పెద్ద వినాయకుడితోపాటు బాలాపూర్ గణేశ్ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్ వినాయకుడి చరిత్ర ఎంతో ఘనంగా ఉంది. లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనే నమ్మకం ఉండడంతో పెద్ద ఎత్తున ఈ లడ్డూ దక్కించుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది.
Also Read: Balapur Laddu: వేలంలో పాల్గొనేవారికి భారీ షాక్.. బాలాపూర్ లడ్డూ ...
బాలాపూర్ చరిత్ర
బాలాపూర్‌లో ప్రతిష్టించే వినాయకుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. యావత్ దేశం దృష్టిని ఆకర్షించే హైదరాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితోనే ప్రారంభమవుతుంది. ఇక్కడి లడ్డూకు ఘన చరిత్ర ఉంది. బాలాపూర్‌లో మొదటిసారి 1980లో గణేశుడిని ప్రతిష్టాపన జరిగింది. నిర్వాహకులు 1994లో తొలిసారి లడ్డూ వేలం నిర్వహించారు. తొలి వేలంలో రూ.450కి స్థానికుడు కొలను మోహన్ రెడ్డి గెలుపొందాడు. పొందిన లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతోపాటు వ్యవసాయ పొలాల్లో చల్లారు. ఆ కుటుంబానికి.. కొలను మోహన్ రెడ్డికి ఆ ఏడాది అన్నీ మంచి జరిగింది. లడ్డూ పొందడం ద్వారానే బాగా కలసొచ్చిందని భావించిన మోహన్ రెడ్డి మరుసటి ఏడాది 1995లో మళ్లీ వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నాడు. అప్పుడు వేలం ధర రూ.4,500. నేటితో పోలిస్తే రూ.లక్షకు పైగా ఉంటుంది. ఆ ఏడాది కూడా లడ్డూ పొందిన అతడికి అన్ని విధాల కలిసి వచ్చింది.
Also Read: Bag Creats Tension: రేవంత్ రెడ్డి నివాసం వద్ద బ్యాగ్ కలకలం.. భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు
ఎనిమిదిసార్లు కొలను వంశస్తులు
ఈ వార్త హైదరాబాద్ వ్యాప్తంగా ప్రచారం జరగడంతో మరుసటి ఏడాది 1996కు బాలాపూర్ లడ్డూకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కసారిగా రూ.18,000కు వేలంలో లడ్డూ ధర పలికింది. ఆ ఏడాది కూడా మోహన్ రెడ్డి కుటుంబసభ్యులు కొలను కృష్ణారెడ్డి గెలుపొందాడు. ఆ తర్వాతి ఏడాది 1997లో మళ్లీ కృష్ణారెడ్డి పొందగా.. 1998లో మళ్లీ కొలను మోహన్ రెడ్డి పొందారు. ఇలా వరుసగా ఐదుసార్లు కొలను వంశస్తులు బాలాపూర్ లడ్డూను పొందారు. కాగా ఇప్పటివరకు జరిగిన బాలాపూర్ వేలంలో అత్యధికంగా ఎనిమిది సార్లు కొలను వంశస్తులే దక్కించుకున్నారు. గతేడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డూ వేలం ధర పలకగా.. ఈసారి రూ.30 లక్షలు దాటుతుందని అంచనా ఉంది.
బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే!
1994 కొలన్ మోహన్ రెడ్డి రూ.450
1995 కొలన్ మోహన్ రెడ్డి రూ.4,500
1996 కొలన్ కృష్ణా రెడ్డి రూ.18,000
1997 కొలన్ కృష్ణా రెడ్డి రూ.28,000
1998 కొలన్ మోహన్ రెడ్డి రూ.51,000
1999 కళ్లెం అంజి రెడ్డి రూ.65,000
2000 కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.66,000
2001 జి రఘునందన్ చారి రూ.85,000
2002 కందాడ మాధవ రెడ్డి రూ.1,05,000
2003 చిగిరింత బాల రెడ్డి రూ.1,55,000
2004 కొలన్ మోహన్ రెడ్డి రూ.2,01,000
2005 ఇబ్రామ్ శేఖర్ రూ.2,08,000
2006 చిగిరింత తిరుపతి రెడ్డి రూ.3,00,000
2007 జి రఘునందన్ చారి రూ.4,15,000
2008 కొలన్ మోహన్ రెడ్డి రూ.5,07,000
2009 సరిత రూ.5,10,000
2010 కొడాలి శ్రీధర్ బాబు రూ.5,35,000
2011 కొలను బ్రదర్స్ రూ.5,45,000
2012 పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ.7,50,000
2013 తీగల కృష్ణా రెడ్డి రూ.9,26,000
2014 సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ.9,50,000
2015 కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10,32,000
2016 కందాడి స్కైలాబ్ రెడ్డి రూ.14,65,000
2017 నాగం తిరుపతి రెడ్డి రూ.15,60,000
2018 తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్త రూ.16,60,000
2019 కొలన్ రామ్ రెడ్డి రూ.17,60,000
2020 కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.
2021 రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి రూ.18,90,000
2022 వంగేటి లక్ష్మా రెడ్డి రూ.24,60,000
2023 దాసరి దయానంద రెడ్డి రూ.27,00,000
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.