Bag Creats Tension: రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద బ్యాగ్‌ కలకలం.. భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు

Bag Found Creats High Tension At Revanth Reddy Residence: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ముఖ్యమంత్రి నివాసం వద్ద ఓ బ్యాగ్‌ కలకలం సృష్టించింది. దీంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 15, 2024, 05:34 PM IST
Bag Creats Tension: రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద బ్యాగ్‌ కలకలం.. భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు

Revanth Reddy Residence: భారీ బందోబస్తు కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి వద్ద గుర్తు తెలియని బ్యాగ్‌ కలకలం రేపింది. కొన్ని గంటలుగా అక్కడే బ్యాగ్‌ పడి ఉండడంతో భద్రతా సిబ్బంది గమనించారు. ఎంతకీ ఎవరూ వచ్చి బ్యాగ్‌ తీసుకెళ్లకపోవడంతో భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. బ్యాగ్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళన చెందారు. వెంటనే అప్రమత్తమై బ్యాగ్‌ వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టారు.

Also Read: Bhaskar Award: తెలంగాణలో 'భాస్కర అవార్డు'.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్‌ సిఫార్సు

 

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో ఆదివారం మధ్యాహ్నం బ్యాగ్ క‌ల‌క‌లం సృష్టించింది. అప్ర‌మ‌త్త‌మైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్ప‌ద బ్యాగ్‌ను అధికారులు త‌ర‌లించి త‌నిఖీ చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నివాసం వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే తనిఖీల్లో ఆ బ్యాగ్‌లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని సమాచారం.

Also Read: Telangana BJP: మోడీ, షా స్ట్రోక్.. ఒక్కటైన తెలంగాణ బీజేపీ నేతలు..

 

కాగా బ్యాగ్‌ కనిపించిన సమయంలో రేవంత్‌ రెడ్డి నివాసంలోనే ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌కు వెళ్లారు. తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడేళ్లకు పైగా పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిన ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీని విజయవంతంగా అధికారం తీసుకొచ్చిన పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ ప్రత్యేకత సాధించాడు. ఆయన సారథ్యంలోనే పార్టీ శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయవంతమైన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x