నల్గొండ: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ( Bandi Sanjay ) నల్గొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను పరిశీలించి రైతులను కలిసేందుకు వచ్చిన బండి సంజయ్... అక్కడే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట బీజేపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక నేతలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో బండి సంజయ్‌తో పాటు ఆయనతో ఉన్న నేతలంతా భౌతిక దూరం పాటించకుండానే పర్యటన కొనసాగించారని నల్గొండ పోలీసులు తెలిపారు. కరోనావైరస్ నివారణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినేలా వ్యవహరించినందుకుగాను బండి సంజయ్‌తో పాటు మిగతా నేతలపై ( FIR filed on Bandi Sanjay and other BJP leaders ) కూడా 188వ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాథ్ పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : భైంసా అల్లర్లు : తెలంగాణ సర్కార్‌కి బీజేపీ ఎంపీ హెచ్చరిక


ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం భారీ సంఖ్యలో జనం ఒక్క చోట గుమికూడటం, సమావేశాలు నిర్వహించడం వంటి పనులు చేయకూడదు. అయినప్పటికీ బండి సంజయ్ ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..