Ganesh Chaturthi 2024: రాజకీయ నాయకుడి కన్నా హిందూత్వవాదిగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ప్రసిద్ధిగాంచారు. ప్రస్తుతం రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చినా.. ఇవ్వకున్నా తాను మండపం నిర్వాహకులకు విద్యుత్‌ సదుపాయం కల్పిస్తానని ప్రకటించారు. తన సొంత డబ్బులు వెచ్చించి మండపాలకు విద్యుత్‌ ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Yadadri Temple: యాదాద్రికి మరింత వైభవం.. తిరుమల స్థాయిలో భారీ ప్రణాళికలు


 


కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేశ్‌ ఉత్సవాలపై కీలక ప్రసంగం చేశారు. మండపాల నిర్వాహకులకు కొన్ని సూచనలు చేశారు. 'గణేశ్ మండప నిర్వాకులారా నవరాత్రి దీక్షలు చేపట్టండి' అని పిలుపునిచ్చారు. 'భక్తిశ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. నేను ఉదాహరణ. 30 ఏళ్లుగా నిత్యం భగవంతుడిని పూజిస్తున్నా. వినాయకుడు పవర్‌ఫుల్‌ దేవుడు' అని తెలిపారు.

Also Read: Corruption: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో లంచావతారం? ఇది నిజమేనా?


 


'గణేశ్ మండపాలకయ్యే విద్యుత్‌ ఖర్చంతా నేనే చెల్లిస్తా. వారిని బిల్లులు అడగొద్దు. మండప నిర్వాహకులను విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దు. నిమజ్జనం రోజే కాకుండా 9 రోజులపాటు కనీస సౌకర్యాలు కల్పించండి' అని అధికార యంత్రాంగానికి బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రశాంతంగా ఉత్సవాలు చేసుకునేలా అందరూ సహకరించాలని కోరారు. 'గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలి. పోలీసులు, అధికారులు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించి కరీంనగర్‌ను ఆదర్శంగా నిలుపుదాం' అని పిలుపునిచ్చారు.


'హిందూ సమాజంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది' అని బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా.. గణేశ్ విగ్రహాలు తీసుకొచ్చే సమయంలో తీగలు అడ్డు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భోజన సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. నిమజ్జనం రోజు గతంలో కంటే ఎక్కువ క్రేన్లు ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook