భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి 2వ వర్ధంతి (Atal Bihari Vajpayee Death Anniversary) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) నివాళులర్పించారు. కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి పుష్పాంజలి (Bandi Sanjay Kumar pays tribute to Vajpayee) ఘటించారు. ప్రధానమంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణలు, నూతన విదేశాంగ విధానంతో వాజ్ పేయిగారు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన సేవల్ని స్మరించుకున్నారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి, రాబోయే తరాలకు అటల్‌జీనే ఆదర్శమన్నారు. Vajpayee Death Anniversary: వాజ్‌పేయికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా ఘన నివాళులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్గిల్ విజయం, పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత శక్తి సామర్థ్యాలు చాటిన వ్యక్తి వాజ్‌పేయి అని బండి సంజయ్ పేర్కొన్నారు. అటువంటి మహనీయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేవిధంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. భారత్ కోసం ధోనీ సాధించిన ఘనతలు, అందించిన ట్రోఫీలు



పార్లమెంటులో వాజ్‌పేయి ప్రసంగం ఉందంటే రాజకీయాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు అందరూ, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేవారని గుర్తుచేశారు. వాజ్‌పేయిగారి స్ఫూర్తితో బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. Gautam Gambhir: ధోనీ రిటైర్మెంట్‌పై భిన్నంగా స్పందించిన గంభీర్