Attack on Bandi Sanjay's convoy: నల్గొండ: తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన నల్గొండ జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది. జిల్లాలోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన బండి సంజయ్‌పై అధికార పార్టీ టీఆర్ఎస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బండి సంజయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు కోడి గుడ్లు, రాళ్లు రువ్వి బీజేపిపై తమకు ఉన్న ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిర్యాలగూడలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా బండి సంజయ్‌ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. బండి సంజయ్ గో బ్యాక్, బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపి, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు ఇరువర్గాలను (Bandi Sanjay Nalgonda tour) చెదరగొట్టేందుకు మధ్యలో కలుగజేసుకోవాల్సి వచ్చింది.


Also read : Siddipet Collector Venkatram Reddy: సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా.. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరిక?


అంతకంటే ముందుగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ద్వంద్వ వైఖరి అవలంభిస్తూ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ కాన్వాయ్‌పై (Bandi Sanjay's Nalgonda, Suryapet tour) ఇలా కోడి గుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.


Also read : Ragging in KMC: కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. మోదీ, అమిత్ షా, కేటీఆర్‌లకు ఫిర్యాదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook