Siddipet Collector Venkatram Reddy: వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. ఇప్పుడు ఐఏఎస్ కు రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోరుతూ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు
‘‘కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోంది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. ఈ అభివృద్ధి మార్గంలో సీఎంతో ఉండాలనుకొని వీఆర్‌ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రానున్న వందేళ్లు తెలంగాణ గురించి ప్రజలు చెప్పుకొనే విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు వచ్చాక టీఆర్ఎస్ లో చేరతాను. సీఎం మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తాను’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.
సిద్ధిపేట జిల్లా పరిధిలో వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హోదాలో ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా విత్తనాలు అమ్మితే.. ఆ పరిధిలోని అధికారులను విధుల్లో నుంచి తొలగిస్తానని వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. దీనిపై విపక్షాలు పలు విమర్శలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు కన్నా.. కలెక్టర్ గొప్పవాడా అని విపక్షాలు ప్రశ్నించాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే.. వరి రైతులపై ప్రభుత్వం కార్యాచరణను స్పష్టం చేయాలని కోరాయి. అంతకుముందు మరో వివాదంలో కూడా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇరుక్కున్నారు. కలెక్టర్ అయి ముఖ్యమంత్రి కాళ్లపై పడటంపై విపక్షాలు, ప్రజలు మండిపడ్డారు.
Also Read: Ragging in KMC: కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. మోదీ, అమిత్ షా,కేటీఆర్‌లకు ఫిర్యాదు
Also Read: Suicide: భార్య వేధిస్తోందని భర్త ఆత్మహత్య.. చావక తప్పట్లేదంటూ సెల్ఫీ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook