Bandla Ganesh: గన్ లో బుల్లెట్ రివర్స్.. కేటీఆర్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
KTR: ఏదైనా సరే ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడే అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. తాజాగా ఆయన మంత్రి కేటీఆర్ పైన చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
Bandla Ganesh on KTR: తెలంగాణలో బిఆర్ఎస్ పైన కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచింది. దాదాపు పది సంవత్సరాల తరువాత కెసిఆర్ తెలంగాణలో ఓటమి చవిచూశారు. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ 7‘o’ క్లాక్ బ్లేడ్‌తో గొంతుకోసుకుంటానని చెప్పి.. దారుణంగా ట్రోల్ అయినా సంగతి తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడటంతో.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్‌ని తెగ ట్రోల్ చేశారు నెటిజెన్స్.
కాగా ఈసారి కూడా బండ్ల గణేష్ ఏమి తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం.. హస్తం హవా ఖాయం.. అని అలానే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే గవర్నమెంట్‌ని ఫామ్ చేస్తుంది అని బండ్ల గణేష్ చాలా నమ్మకంతో ఎలక్షన్స్ ముందు చెబుతూ వచ్చారు. ఇక ఈసారి అదృష్టం కొద్ది బండ్ల గణేష్ మాట నిజమయింది. దీంతో కెసిఆర్ కొడుకు.. తెలంగాణ ఐటీ మినిస్టర్ అయినా కేటీఆర్ పైన తనదైన స్టైల్ లో పోస్ట్ వేశారు బండ్ల గణేష్.
కొద్ది రోజుల క్రితమే కేటీఆర్.. తన ట్విట్టర్ అకౌంట్ లో గన్నులో గురి పెడుతూ.. తమ పార్టీకి మూడో విజయం ఖాయం(లోడింగ్ 3.0) అని.. సెలబ్రేషన్స్ మొదలపెట్టొచ్చని ఒక పోస్ట్ వేశారు.. ఇక ఈ పోస్ట్ కి సెటైర్ వేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ విజయం సాధించాక మరో పోస్ట్ వేశారు బండ్ల గణేష్.
‘రేవంత్ రెడ్డి.. దమ్మున్న నాయకుడు.. జనంలో నుంచి వచ్చిన నాయకుడు.. జన నాయకుడు. అతని గురి అందుకే తగ్గలేదు. కేటీఆర్ గారు 3.0 అని కేటీఆర్ గారు గన్ పెట్టారు కదా.. ఆ గన్ గురిపెట్టడం చూసి రాత్రికి రాత్రి ఏమైనా బ్యాలెట్ బాక్స్‌లు మార్చేస్తారా? అని అనిపించింది. అందుకే బాక్స్‌లు జాగ్రత్త…. బ్యాలెట్ బ్యాక్స్‌లను జాగ్రత్తగా కాపాడుకోమని కాంగ్రెస్ కార్యకర్తల్ని కోరాను. ఇప్పుడు కేటీఆర్ గన్ గురిపెట్టడం చూస్తే.. నాకు అతడు సినిమా గుర్తొచ్చింది. నాజర్ హీరో మహేష్ బాబుకి ఒక గన్ ఇస్తాడు. కానీ అదే చివర్లో రివర్స్ అయ్యి విలన్‌కి తగులుతుంది.. అతను చనిపోతాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా గన్ గురి పెట్టాడు కానీ.. బుల్లెట్ రివర్స్‌లో పెట్టాడు. దాంతో గన్ నొక్కగానే టపీమని వచ్చి రివర్స్‌లో తేలింది. ఇక వాళ్లని వాళ్లే కొట్టుకున్నారు. ఈ ఓటమి కారణం ఖచ్చితంగా కేటీఆరే. గర్వంతో మేం అసలు మనుషులం కాదు.. దేవుళ్లం అన్నట్టుగా ప్రవర్తించారు కేటీఆర్. నేను హరీష్ రావుగారిపై గానీ.. కేసీఆర్ గారిపై కానీ.. కామెంట్ చేయను. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారని ఇక్కడ ధర్నాలు చేస్తుంటే.. విజయవాడ పోయి అరెస్ట్ చేసుకోండని అన్నారు కేటీఆర్. ఆయన ఇది మన భారతదేశం అని మర్చిపోయి మాట్లాడారు.. అందుకే జనం గట్టిగానే సమాధానం చెప్పారు’ అంటూ పోస్ట్ వేసుకు వచ్చాడు బండ్ల గణేష్.
Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..
Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి