Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Animal Movie: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ర‌ణ్‌బీర్ కపూర్ నటించిన చిత్రం యానిమల్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజే ఏ రేంజ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2023, 04:26 PM IST
Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Animal Movie first day box office collection: బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్(Ranbir Kapoor) - తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ 'యానిమల్'Animal Movie). అర్జున్‌ రెడ్డి, క‌బీర్ సింగ్‌ల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్‌లు కొట్టిన సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ లెవల్లో అంచనాలు పెరిగిపోయాయి. డిసెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. తొలి రోజే ఏకంగా వంద కోట్ల మార్కును అందుకుని రికార్డు సృష్టించింది. రణబీర్ తనలోని వ‌యిలెన్స్ ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కు మరోసారి రుచిచూపించాడు. అతడి దెబ్బకు రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. 

యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.116 కోట్ల కలెక్షన్లను సాధించింది. కేవలం మనదేశంలోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కర్నాటక, తమిళ్, కేరళ కలిపి మొత్తంగా రూ.60 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇదే దూకుడు కొనసాగితే ఈ మూవీ మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది. 

ఈ చిత్రంలో రణ్‌బీర్‌ తండ్రిగా అనిల్ కపూర్ నటించాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా , కీలకపాత్రలో బాబిడియోల్ నటించారు. త్రిప్తి డిమ్రి, పృథ్వీరాజ్‌, శక్తి కపూర్‌, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్, రవి గుప్తా, సిద్ధాంత్ కర్నిక్ త‌దిత‌రులు కీలకపాత్రల్లో కనిపించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ అందించిన నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంది. అమిత్‌రాయ్ కెమెరా ప‌నిత‌నం బాగుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా నిర్మించాయి. 

Also read: Animal Movie Leaked: యానిమల్ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి ఫుల్‌మూవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News