Cashier Escape: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా నగదు చోరీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోనికి వస్తోంది. నాలుగు రోజులవుతున్నా బ్యాంక్ నగదుతో పరారైన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ ఆచూకి ఇంకా లభించలేదు. ప్రత్యేక పోలీసు బలగాలతో గాలిస్తున్న క్యాషియర్ ఎక్కడున్నారన్నది ట్రేస్ కావడం లేదు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న క్యాషియర్ ప్రవీణ్ కుమార్.. సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నారు. అందులో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. గురువారం ఒక వీడియో విడుదల చేసిన ప్రవీణ్ కుమార్.. ఇవాళ మరో వీడియో రిలీజ్ చేశాడు. అందులో బ్యాంక్ సిబ్బందిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంక్ లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని.. వాటిని ప్రశ్నించినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని సెల్ఫీ వీడియోలో ప్రవీణ్ కుమార్ చెప్పారు. NRI ఖాతాల్లో అక్రమ నగదు బదిలీలు జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ  బాగోతాన్ని గతంలో తాను ప్రశ్నించానని తెలిపాడు. బ్యాంక్ క్యాష్ కౌంటర్ లో సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేదని తెలిపాడు. నగదు దాచేందుకు సేఫ్ లాకర్ కూడా లేదన్నారు. బ్యాంక్ నగదును బీరువాలో పెడుతున్నారని సెల్ఫీ వీడియోలో వివరించాడు క్యాషియర్ ప్రవీణ్ కుమార్. బ్యాంక్ లో గతంలోనూ నగదులో తేడా వచ్చిందని తెలిపాడు. తనను కట్టాలని ఒత్తిడి చేయడంతో అప్పుకు తెచ్చి కట్టానని క్యాషియర్ తెలిపాడు. తాజాగా 23 లక్షల రూపాయలు తక్కువగా లెక్క వచ్చిందని...  ఆ డబ్బులు కట్టలేకే తాను పారిపోయానని ప్రవీణ్ కుమార్ వెల్లడించాడు. తాను హైదరాబాద్ తిరిగి వస్తానని.. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తానని తాజా సెల్ఫీ వీడియోలో తెలిపాడు ప్రవీణ్ కుమార్.


మరోవైపు  బ్యాంక్ నగదు చోరీ కేసులో పురోగతి లభించింది. క్యాషియర్ ప్రవీణ్ కుమార్ బుల్లెట్ బైక్  నల్గొండ జిల్లా చిట్యాలలో లభ్యమైంది. వనస్థలిపురం పోలీసులు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మాత్రం క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే క్యాషియర్ నగదు చోరీకి చేయడానికి కారణమని భావిస్తున్నారు. సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో  నాలుగు రోజుల క్రితం నగదు చోరీకి గురైంది. నగదు మాయమైన రోజు డ్యూటీకి వచ్చిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్.. కడుపు నొప్పి వస్తుందని మేనేజర్ కు చెప్పాడు. టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదు. ఈవెనింగ్ వరకు రాకపోవడంతో మేనేజర్ అకౌంట్స్ చెక్ చేయగా.. 23 లక్షల రూపాయల తేడా వచ్చింది. ప్రవీణ్ కుమార్ కు మేనేజర్ ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో నగదు పోయిందంటూ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


READ ALSO:Karate Kalyani: యూట్యూబ్ ప్రాంక్‌స్టర్‌పై కరాటే కల్యాణి దాడి.. నడిరోడ్డుపై రచ్చ రచ్చ... వీడియో వైరల్..


READ ALSO: Teenmar Mallanna political Party: టీఆర్‌ఎస్‌ నిట్టనిలువుగా చీలే రోజు త్వరలోనే ఉందన్న తీన్మార్‌ మల్లన్న


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook