Cashier Theft Bank Cash: హైదరాబాద్ లో సంచలనంగా మారిన క్యాషియర్ బ్యాంక్ నగదుతో పరారైన కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. పరారైన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నారు. అయితే వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగి డబ్బుల చోరీలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెట్టింగ్ లో భారీగా డబ్బులు లాసైన క్యాషియర్.. బ్యాంక్ నగదు తీసుకుని వెళ్లిపోయాడని తెలుస్తోంది.  తాజాగా డబ్బులు తీసుకెళ్లిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ సహచర సిబ్బందికి మెసేజ్ చేశాడు. బెట్టింగ్ లో భారీగా నష్టపోయనని, ఇప్పుడు తీసుకెళ్లిన డబ్బుతో మరోసారు బెట్టింగ్ పెట్టానని చెప్పాడు. బెట్టింగ్ లో తనకు వస్తే తిరిగి ఇస్తానని, లేకపోతే సూసైడ్ చేసుకుంటానని బ్యాంకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడు. తన సహచర సిబ్బంది ప్రవీణ్ కుమార్ చేసిన మెసేజ్ తో క్రికెట్ బెట్టింగే బ్యాంక్ నగదు చోరీకి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.


వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు రోజుల క్రితం డబ్బు మాయమైంది. 22 లక్షల 53 వేల రూపాయల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు.  రోజులాగే డ్యూటికి వచ్చాడు ప్రవీణ్ కుమార్. కొంతసేపటి తర్వాత తనకు కడుపునొప్పి వస్తుందని మేనేజర్ కు చెప్పాడు.  టాబ్లెట్స్ తెచ్చుకుంటానని బయటికి వెళ్లాడు. తర్వాత తిరిగి బ్యాంక్ కు రాలేదు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో బ్యాంక్ క్లోజ్ చేసి సమయంలో మేనేజర్ అకౌంట్స్ చెక్ చేశాడు. నగదులో 23 లక్షలు తక్కువ వచ్చినట్టు తేలింది. దీంతో క్యాషియర్ కి మేనేజర్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రవీణ్ కుమార్  స్పందించక పోవడంతో.. బ్యాంక్  చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బ్యాంక్ కి వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. బ్యాంక్ సిబ్బందిని విచారించారు పోలీసులు.  


READ ALSO: Where Is Cm Kcr: సీఎం కేసీఆర్ ఎక్కడ..! ఫాంహౌజ్ లో ఏం చేస్తున్నారు?


READ ALSO: CM Jagan Serious: అలా చేస్తే జిల్లా బహిష్కరణే..సీఎం జగన్ సంచలన నిర్ణయం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook