Barrelakka: బర్రెలక్క మరో సంచలనం.. ఈసారి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంపీ ఎన్నికల్లో పోటీ
Barrelakka Filed Nomination For Lok Sabha Elections: అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క మరో కీలక అడుగు వేసింది. మళ్లీ ఎన్నికల్లో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసింది.
Barrelakka Next Step: తెలంగాణలో గతేడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క అలియా కర్నె శిరీష పోటీ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీగా ఓట్లు కొల్లగొట్టింది. ఓడిపోయినా నిరుద్యోగుల తరఫున తన పోరాటం కొనసాగిస్తానని నాడు చెప్పిన శిరీష చెప్పిన ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగింది.
Also Read: Barrelakka Marriage: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్ మీడియా అతిథులు
నాగర్‌కర్నూలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం శిరీష నామినేషన్ పత్రాలు సమర్పించింది. స్వతంత్ర అభ్యర్థిగా శిరీష కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది. ఆమె వెంట భర్త, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నిలిచి దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమెకు అండగా పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సామాజిక సంఘాలు, కొందరు మేధావులు ఉన్నారు.
Also Read: Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..
ఎవరు బర్రెలక్క?
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 6 వేల ఓట్లను శిరీష సాధించింది. నిరుద్యోగుల గొంతుకగా పోటీ చేయడంతో శిరీషకు అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు మరోసారి అదే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటికి దిగింది. ఆమె పోటీ చేస్తున్న నాగర్‌కర్నూల్ సీటు హాట్‌హాట్‌గా మారింది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి పోతుగంటి భరత్‌ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి బరిలో ఉన్నారు. బర్రెలక్క బరిలో దిగినా కూడా ఈ మూడు ప్రధాన పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉండనుంది. ఇప్పటివరకు చూస్తే నాగర్‌కర్నూలు ఎంపీ స్థానంలో బీఆర్‌ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని తెలుస్తోంది.
ఇటీవల రెండో వివాహం
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకర్గం పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన కర్నె శిరీష బర్రెలక్కగా గుర్తింపు పొందింది. అయితే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న శిరీష ఇటీవల రెండో వివాహం చేసుకుంది. పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడితో ఈ ఏడాది మార్చి 28వ తేదీన శిరీష వివాహం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలోని ఓ ప్రవేయిట్ ఫంక్షన్ హల్లో బర్రెలక్క వివాహం జరగ్గా.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాట యూట్యూబ్ తదితర సోషల్ మీడియా స్టార్లు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter