Pawan Kalyan: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాల్లో తన ఆస్తిపాస్తులను వెల్లడించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ తన ఆస్తులు రూ.114.76 కోట్లు అని వెల్లడించారు. ఆ సంపాదన అంతా సినిమాల ద్వారా వచ్చిందని వివరించారు.
Also Read: Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదా
ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో సంపాదన, అప్పులు, విరాళాల వివరాలను పవన్ కల్యాణ్ తెలిపారు. ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు 76 లక్షలు ఉంది. ఇక తన సంపాదనలో ప్రభుత్వానికి పన్నులరూపంలో చెల్లించిన డబ్బులు రూ.73.92 కోట్లుగా పేర్కొన్నారు. వచ్చిన సంపాదనలో పవన్ కల్యాణ్ సేవా కార్యక్రమాలకు కూడా విరాళాలరూపంలో ఇస్తున్నారు. రూ.20 కోట్ల వరకు విరాళాలు ఇచ్చినట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. అప్పుల విషయానికి వస్తే రూ.64.26 కోట్లు ఉన్నాయని తన అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ ర్యాలీ భారీగా నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ సమర్పించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. 'కూటమిగా పోటీ చేసేందుకు జనసేన, టీడీపీ త్యాగాలు చేశాం . 30 నుంచి 40 చోట్ల జనసేనకు బలమైన అభ్యర్థులు ఉన్నా త్యాగాలు చేశాం' అని చెప్పారు. వచ్చేనెల పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇంటికి పెన్షన్లను అడ్డుకున్నట్లుగా భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter