Bathukamma 2022 Wishes: నవరాత్రులు వచ్చాయంటే భారత్ దేశవ్యాప్తంగా భక్తులంతా అమ్మవారిని పూజిస్తారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఈ నవరాత్రులకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే బతుకమ్మ సంబరాలు.. అవును ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడమే కాకుండా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆటపాటలతో బతుకమ్మను ఆడుతారు. ఈ క్రమంలో ప్రధాన దేవతగా గౌరీ మాతను పూలతో అలంకరించి పండగను జరుపుకుంటారు. అందుకే బతుకమ్మకు పూల పండగని కూడా పేరు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తొమ్మిది రోజుల విషయానికొస్తే ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రకమైన పువ్వుతో బతుకమ్మను పేరించి. ఆ పూలను భక్తిశ్రద్ధలతో ఆరాధించి నీటిలో వదలడం ఆనవాయితీ. అయితే ఇదే క్రమంలో ఒక్కొక్క రోజు గౌరీ మాతాకు (బతుకమ్మ) ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇదే క్రమంలో పాటలు పాడుతూ కోలాటాలు కూడా వేస్తారు.


తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పండగను తెలంగాణ పండగ గుర్తించి అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయం ముందు బతుకమ్మలను కూడా ఆడుతున్నారు. ఇదే క్రమంలో సెలవులు కూడా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రాచీన కాలం నుంచి వస్తున్న బతుకమ్మకు ప్రభుత్వం మంచి గుర్తింపుని ఇచ్చింది.


బతుకమ్మ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి:
>>తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ...తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
>>తెలుగింటి ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
>>తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.
>>తీరొక్క పూలతో తీర్చిదిద్ది..
ఆటపాటలు, కోలాటాలు..
అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా మన ఆడబిడ్డలందరికీ..బతుకమ్మ శుభాకాంక్షలు.
>>ప్రకృతిలోని పువ్వులు, మన సంస్కృతి..
నవ్వులు కలబోస్తే కలిగేను మన ఆడపడుచుల్లో
బతుకమ్మ చిరునవ్వులు
ప్రకృతినే పూజించే పండుగ బతుకమ్మ..
తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.


Also read:Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!


Also read:Viral Video: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గర్బా స్టెప్పులు..వీడియో వైరల్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి