Bathukamma Festival: తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం, శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
Bathukamma Festival: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికగా బతుకమ్మ సంబరాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పండుగ సంబరాల్లో తెలంగాణ ఆడపడుచులు సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.
Bathukamma Festival: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికగా బతుకమ్మ సంబరాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పండుగ సంబరాల్లో తెలంగాణ ఆడపడుచులు సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్ర ప్రజలకు దసరా(Dussehra)ప్రారంభమవుతూనే..తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా పూల పండుగను జరుపుతారు తెలంగాణ ప్రజలు. పూలతో దేవుడిని కొలిచే దేశంలో..ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. ఆడపడుచులు వివిధ రకాల పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయల్ని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations)ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు ఆడబిడ్డలు పూలతో పండుగ సందడి చేస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే వేడుకలు..సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. బతుకమ్మ పండుగ ప్రారంభమైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. అశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ అనంతరం వచ్చే తెలంగాణ ఆడపడుచుకు స్వాగతం..9 రోజులపాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాల్ని తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం. ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ(Bathukamma Festival)శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో చాలా పర్యాయ పదాలు వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ(Bathukamma) అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలుగా పేరుస్తారు. మధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారవు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భాగాన్ని ఉంచుతారు. దీన్ని బొద్దెమ్మగా పిలుస్తారు. కొందరు బొద్దెమ్మను దుర్గగా కొలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించు లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు.
Also read: Telangana RTC: ఆర్టీసీ సరికొత్త సేవలు, ఫోన్ చేస్తే ఇంటి వద్దకే బస్సు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి