Manda Krishna Meet The Press: దేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమం తెలంగాణలో జరగబోతున్నట్లు మాదిగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. లక్ష డప్పులు.. వేల గొంతులు కార్యక్రమంతో మాదిగలు సత్తా చాటబోతున్నారని.. త్వరలో ఎస్సీ వర్గీకరణ సాధ్యమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి రోజుకో తీరున వ్యవహరిస్తున్నాడని.. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Gaddar Award: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. 'ఎంతో మందిని చంపిన వ్యక్తి గద్దర్‌'


హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో సోమవారం నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నది వెంకటస్వామి కొడుకు వివేక్. రేవంత్ రెడ్డిని అడ్డుకుంటుంది రెండు మాలల కుటుంబాలు. ఒకటి మల్లు కుటుంబం, (భట్టి విక్రమార్క, మల్లురవి), మరొకటి వెంకట స్వామి (వివేక్, వినోద్) కుటుంబం' అని సంచలన ఆరోపణలు చేశారు.

Also Read: Republic Day: గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి.. హుస్సేన్‌సాగర్‌లో మంటలు


'ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డికి రెండు నెలలు సమయం ఇచ్చాం. ఇక ఆగేది లేదు' అని మందకృష్ణ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని రేవంత్ రెడ్డి అంటాడు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తొండాట ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఏ పార్టీలో లేనంత ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే మాలల ఆధిపత్యం ఉంది' అని విమర్శించారు.


'రూ.లక్ష కోట్ల ఆస్తులు కలిగిన వీ6, వెలుగుతో మాలల ఉద్యమాన్ని వివేక్‌ అడ్డుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కరిగే మాల. పరేడ్ మైదానంలో మాలల సింహ గర్జన అని మీటింగ్ పెట్టుకున్నారు. లక్ష బర్షలు లక్ష కట్టెలు అని మాలలు నినాదం తీసుకున్నారు' అని మందకృష్ణ తెలిపారు. మా ఆవేదన వినిపించడం కోసం లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమం చేస్తున్నాం. మాలలు అనే సింహాల మధ్యలో మాదిగలు అనే జింకలు బతకలేము' అని ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.