Auto Transport Bandh: కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద తీసుకొచ్చిన 'ఆర్టీసీ బస్సు రవాణా'తో తమ జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీయడంతో ఆటో కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహంతో ఆటో కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తమ సమస్యలపై ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాలకు దిగారు. ఆటోలను బంద్‌ చేసి పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆటో కార్మిక సంఘాలు కీలక ప్రకటన విడుదల చేశాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ప్రతిపక్షంలో రజినీ.. ఇప్పుడు గజినీ: హరీష్‌ రావు


 


ఆటో క్యాబ్ టాక్సీ డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఈనెల 7వ తేదీన ఆటో బంద్  చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆటో బంద్‌కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న ఏఐటీయూసీ భవన్‌లో సోమవారం జేఏసీ నాయకులు ఆటో బంద్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ.. మహిళల కోసం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు వలన ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు.

Also Read: BRS Party: 'ఏడాదైనా పాలమూరు జిల్లాలో రేవంత్‌ రెడ్డి తట్టెడు మట్టి ఎత్తలేదు'


ఉచిత బస్సు రవాణాతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి వెంటనే హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఆటో, రవాణా రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చి.. ఓలా, ఊబర్, రాపిడో ద్వారా అక్రమంగా నడుస్తున్న టూవీలర్లను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై రేవంత్‌ రెడ్డి స్పందించకుంటే ఈనెల 9వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కిస్తీలు చెల్లించే పరిస్థితి కూడా
ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలు ఎక్కే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. దీని కారణంగా ఆటో కిస్తీలు చెల్లించే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబాన్ని పోషించలేక.. అప్పులు కట్టలేక ఆటో కార్మికులు పదుల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఏడాదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. రేవంత్ ప్రభుత్వం పట్టించుకోపోతే ఉద్యమాన్ని తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.