Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సభా సమరానికి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లోపల.. బయట భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మూడంచెల వ్యవస్థతో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. గ్యారంటీలు పక్కాగా అమలుచేస్తున్నామని అధికార పక్షం చెప్పేందుకు సమావేశాలను ఉపయోగించుకోనుండగా.. ప్రజా సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు హాజరవుతున్నారని సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకి


శాసనసభ సమావేశాలు మంగళవారం, శాసనమండలి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల నేపథ్యంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. ఆనవాయితీ ప్రకారం మొదటి రోజు తాజా, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం తెలువుతారు. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలపనున్నారు. అనంతరం సభ వాయిదా వేస్తారు. అనంతరం ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది బీఏసీ సమావేశంలో చర్చిస్తారు. ఈనెల 25వ తేదీన సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

Also Read: Telangana Police: అమ్మనా బూతులతో రెచ్చిపోతున్న తెలంగాణ పోలీసులు.. కేటీఆర్‌, నెటిజన్లు ఆగ్రహం


 


అస్త్రశస్త్రాలతో బీఆర్‌ఎస్‌ సిద్ధం
అసెంబ్లీ సమావేశాలకు మంగళవారం ఉదయం గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ శాసనసభా పక్షం భేటీ  జరుగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సి న వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.


బడ్జెట్ రోజున‌ అసెంబ్లీకి కేసీఆర్
అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదు. ఎన్నికల అనంతరం తుంటి ఎముక విరిగి శస్త్ర చికిత్స పొందడంతో దాదాపు నాలుగు నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో, ఆ తర్వాత జరిగిన శీతాకాల సమావేశాలకు కేసీఆర్‌ హాజరుకాలేదు. కోలుకున్న తర్వాత కూడా కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


రంగంలోకి గులాబీ బాస్‌
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హామీల అమలులో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమవడం.. పదేళ్ల పాలనపై తప్పుడు ప్రచారం చేస్తుండడంతో ఇక కేసీఆర్‌ రంగంలోకి దిగనున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా కేసీఆర్‌ దూకుడు ఉండనుంది. కేసీఆర్‌ హాజరు కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా జరిగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ హాజరుతో ప్రజలంతా అసెంబ్లీ సమావేశాలను ఆసక్తిగా తిలకించే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి