Telangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకి

Alleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 22, 2024, 07:56 PM IST
Telangana Scams: తెలంగాణలో మరో బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే.. మరో భారీ కుంభకోణం వెలుగులోకి

Alleti Maheshwar Reddy Allegations: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, రేవంత్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను బయటకు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న మహేశ్వర్‌ రెడ్డి తాజాగా మరో సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read: Telangana Police: అమ్మనా బూతులతో రెచ్చిపోతున్న తెలంగాణ పోలీసులు.. కేటీఆర్‌, నెటిజన్లు ఆగ్రహం

భారీ కుంభకోణం
దేశంలోనే భారీ అవినీతి కుంభకోణం పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేశారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న మీడియా హాల్‌లో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దేశంలో భారీ అవినీతి కుంభకోణంలో తెలంగాణ మంత్రి ఉన్నారు. యూరో ఏక్సిమ్ బ్యాంకు, చట్టాలకు సంబంధం లేని ఫైనాన్స్ కంపెనీ, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు ద్వారా గ్యారెంటీలు రూ.400 కోట్లకు గ్యారెంటీలు ఇచ్చేలా ఆర్‌బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి. సర్పంచ్‌లకు బిల్లులు రావు కానీ మంత్రి పొంగులేటి రూ.వందల కోట్ల చెల్లింపులు జరుగుతాయి. పొంగులేటికి రూ.వందల కోట్ల బిల్లులు క్లియర్ అవుతున్నాయి' అని మహేశ్వర్‌ రెడ్డి వివరించారు.

Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం

'ఈ కంపెనీకి చెందిన కుంభకోణం ఇది. ఇలాంటి కుంభకోణంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రికి అనర్హుడు' అని మహేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇంకా చాలా ఉన్నాయి. వరుసగా బయట పెడుతా' అని పేర్కొన్నారు. నకిలీ ధృవపత్రాలతో రూ.వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని, చట్టాలను మోసం చేస్తున్నారు. వీటిపై ఎంత పెద్దవారున్నా న్యాయ విచారణ చేయాల్సిందే. సీబీఐ విచారణ జరిపించాల్సిందే. దేశ చట్టాలను అతిక్రమిస్తున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందే' అని స్పష్టం చేశారు.

అన్నింటా పోరాటం
'నాలుగు వందల మంది కాంట్రాక్టర్లు ఈ విధంగా మోసపూరితమైన వ్యవస్థ నడుస్తుంది. ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి. బ్యాంకు గ్యారంటీ జెన్యూన్ అని చెపుతుంది ఎస్‌బీఐ ఏ అధికారంతో ఇచ్చింది' అని మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇవ్వకపోతే నకిలీవి సృష్టించారా విచారణ చేయాలని కోరారు. గ్యారెంటీ ఇస్తూనే ఏమైనా జరిగితే తమకు సంబంధం లేదంటూ పేర్కొనడంలో అంతర్యమేమిటిని సందేహాలు వ్యక్తం చేశారు. ఇవే కాదు మహిళలు, విద్యార్థులు, రైతులు, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తుతామని హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News