Labana Lambadis Nominations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్‌ పార్టీ బిగ్ రిలీఫ్ లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తామని హెచ్చరించిన లబానా లంబాడీలు.. తాజాగా తమ నిర్ణయాన్ని ఉపసహరించుకున్నారు. షెడ్యూల్ తెగల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని లబానా (కాయితీ) లంబాడీలు  తెలిపారు. తమకు పెద్ద మొత్తం నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి తాము మద్దతు ఇస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని.. తమ సమస్యలను పరిష్కరిస్తుందని నమ్మకంతో చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేద్దామని అనుకున్నామని.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. ఎంపీ బీబీ పాటిల్ అధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్ రావును వారు కలిసి.. తన నిర్ణయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకువచ్చారు. లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. సంక్షేమ బోర్డు ఏర్పాటును చేయాలన్నారు.


అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. షెడ్యూలు తెగల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, సామాజిక, రాజకీయ అంశాల్లో అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. గిరిజనుల కల సాకారం చేసేలా..    4 లక్షల ఎకరాలకు పైన పోడు పట్టాలను అందజేశారని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేద బీఆర్ఎస్ పార్టీనేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. న్యాయ సలహా అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం లబానా లంబాడీలు ఎస్టీ జాబితాలో చేరుస్తామని.. సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాన్ని తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 


Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి