KCR Campaign Ban: లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగం చేశారనే కారణంతో ఎన్నికల సంఘం కేసీఆర్‌పై ప్రచారం నిషేధం విధించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయరాదని ఆదేశించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి రావడంతో గులాబీ పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు.
Also Read: KTR Challenge: 'లంగలకు పెత్తనం ఇస్తే నెత్తి మీద పెత్తనం చేస్తారు' మోదీ, రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరిసిల్లలో ఏప్రిల్ 5వ తేదీన కేసీఆర్‌ పొలంబాట కార్యక్రమం చేపట్టారు. కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించిన అనంతరం సిరిసిల్లలో జరిగిన సమావేశం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్‌ నాయకుడు నిరంజన్‌ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించి పరిశీలించన అనంతరం కేసీఆర్‌ నుంచి వివరణ కోరింది. 

Also Read: Asaduddin Owaisi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేది అతడే.. నా మద్దతు అతడికే: అసదుద్దీన్ ఓవైసీ


కొన్ని రోజులు ఆలస్యంగా ఎన్నికల సంఘానికి కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. అయితే వివరణతో సంతృప్తి చెందని గులాబీ అధినేతపై చర్యలు తీసుకుంది. 'బుధవారం రాత్రి 8 నుంచి 48 గంటల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయరాదు' అని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో కేసీఆర్‌ మహబూబాబాద్‌లో చివరగా బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఆ పర్యటనలో అత్యంత వేగంగా ప్రచారం చేసి వెనక్కి వచ్చేశారు. ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు నిషేధం అమల్లో ఉండనుంది. అనంతరం కేసీఆర్‌ యథావిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు.


ఈసీపై బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్రు
ప్రచారంపై నిషేధం విధించడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌ను ప్రజల నుంచి దూరం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుమ్మకై కేసీఆర్‌ను ప్రచారానికి దూరం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం 'తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయింది' అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్‌ ప్రచారానికి దూరం కావడంతో గులాబీ శ్రేణులు నిరాశ చెందారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter