BRS Rajendra Nagar MLA Prakash Goud Ready To Joins Congress: తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది మరింత హీట్ ను పెంచుతున్నాయి. ఇప్పటీకే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి,కే కేశవరావు, దానంనాగేందర్ వంటి సీనియర్ లీడర్ల కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ గెట్లు ఎత్తితే అనేక మంది బీఆర్ఎస్ లీడర్లు జాయిన్ అవ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నట్లుగానే.. బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి మరీ కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ఇక.. బీఆర్ఎస్ మాత్రం వెళ్లిపొయిన నేతలు.. మరల కాళ్లుపట్టుకుని వెంటపడిన రానివ్వమంటూ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?


ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో పలువురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీఫారం లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనేతలతో చర్చించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారంటూ కొత్త రాగం మొదలుపెట్టారు. దీంతో ఇది ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్స్ లో రాజకీయా దుమారంగా మారింది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ లోనుంచి తిరిగి బీఆర్ఎస్ లోకి రావడమేంటని గుసగుసలు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ను వెనుకవైపు నుంచి బీజేపీ నడిపిస్తుందన్నారు. అంతేకాకుండా..రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారని కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.


అయితే.. ఇది జరిగి ఒక్కరోజు కూడా కాకుండానే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. రాజేంద్ర నగర్ కు చెందిన ఎమ్మెల్యే.. ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారంట. నేడో, రేపో తన అనుచరులతో కలిసి సీఎం రేవంత్ ను ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకుంటారని సమాచారం. ఇదిలా ఉండగా.. గ్రేటర్ లో కాంగ్రెస్ మరోసారి తన చరిష్మాచూపించాలని భావిస్తుంది. దీనిలో భాగంగానే.. బీఆర్ఎస్ హైదరాబాద్ నేతల్ని కాంగ్రెస్ లోకి చేర్చుకుంటుంది.


Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..


రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 99 సీట్లు గెలుచరుకుంది. ఇక బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ కాస్తంతా వెనుకబడింది. అందుకే సీఎం మరోసారి కాంగ్రెస్ రాజకీయాలలో ప్రత్యేకంటా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ లోకి చేరడం, రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ నువ్వా నేనా.. అన్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook