Gangula Kamalakar: తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత భారత రాష్ట్ర సమితికి గడ్డు కాలం ఏర్పడింది. ఆ పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు, నలుగురు అధికారికంగా కండువా కప్పుకోగా.. తాజాగా మరికొందరు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారని సమాచారం. తాజాగా కరీంనగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ కూడా పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రేవంత్‌ రెడ్డితో కమలాకర్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గంగుల పార్టీ మారితో మాత్రం గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో భారీ ఎదురుదెబ్బ తగలనుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR: రేవంత్‌ రెడ్డి మగాడివైతే.. దమ్ముంటే హైదరాబాద్‌కు నీళ్లు ఇవ్వు: కేటీఆర్‌ సవాల్‌


టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన గంగుల కమలాకర్‌ బీఆ్‌ఎస్‌ పార్టీలో పదకొండేళ్లుగా కొనసాగుతున్నారు. పార్టీ అధికారం కోల్పోయినా గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యేకత చాటారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గంగుల కమలాకర్‌ తన రాజకీయ భవిష్యత్‌ చూసుకుంటున్నారని సమాచారం. ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ గాలం వేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ స్థానం టికెట్‌ ఇస్తామని హామీ ఇవ్వడంతో గంగుల పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ప్రస్తుతం కరీంనగర్‌ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీకి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలో గంగులను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే రేవంత్‌ రెడ్డితో గంగుల చర్చలు జరిపారని వార్తలు గుప్పుమన్నాయి. తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌ కండువా వేసుకునేందుకు గంగుల సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.

Also Read: KTR Campaign: రేవంత్‌, ఈటలకు మాజీమంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌.. ఇద్దరికి సవాళ్ల పర్వం


కాంగ్రెస్‌లోకి గంగుల చేరితే మాత్రం కంచుకోటలాంటి కరీంనగర్‌లో గులాబీ పార్టీకి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. మొదటి నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. గంగుల ఫిరాయింపుతో గులాబీ పార్టీకి కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.


గంగుల రాజకీయ ప్రస్థానం
గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్న గంగుల కమలాకర్‌ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించాడు. 2000లో  కరీంనగర్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2009లో టీడీపీ నుంచి కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన కమలాకర్‌ తెలంగాణ ఉద్యమం సమయంలో నాటి టీఆర్‌ఎస్‌.. నేటి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2014, 18, 2023లో కరీంనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. సీఎం కేసీఆర్‌ మంత్రివర్గంలో రెండు పర్యాయాలు గంగుల కమలాకర్‌ మంత్రిగా పని చేశారు. కరీంనగర్‌లో వెలమ సామాజికవర్గం ఆధిపత్యం చేస్తున్న రాజకీయాల్లో బీసీ అయిన కమలాకర్‌ తిరుగులేని నేతగా ఎదిగారు. గంగుల కమలాకర్‌ను 'కరీంనగర్‌ భీముడు'గా పిలుస్తుంటారు. 

 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook