Boora Narsaiah Goud Resign: శుక్రవారం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు.  సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు. లేఖలో తన ఆవేదన పంచుకున్నారు బూర నర్సయ్య గౌడ్. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. బలహీన వర్గాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చే పరిస్థితి లేనప్పుడు తాను టీఆర్ఎస్ లో కొనసాగడం అర్ధరహితమని లేఖలో పేర్కొన్నారు బూర నర్సయ్య గౌడ్.  2019లో ఓటమి తర్వాత పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో తన  అవసరం లేదని మీరు భావించారంటూ కేసీఆర్ ను ఉద్దేశించి లేఖలో ప్రస్తావించారు బూర. మునుగోడులో పార్టీ సమావేశాలకు తనను కావాలని పిలవలేదని, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పైరవీలు చేయనని తెలిసినా సీఎం తనను దూరం పెట్టారని బూర అన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందన్నారు బూర నర్నయ్య గౌడ్. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారని అన్నారు. ఆత్మీయ సభలకు కావాలనే తనకు ఆహ్వానం పంపలేదన్నారు. మునుగోడు ఉపఎన్నికపైనా తనతో మాట్లాడలేదని తన లేఖలో బూర వెల్లడించారు.  నేను వ్యక్తిగతంగా అవమానపడ్డా.. పార్టీకి నా అవసరం లేదని భావిస్తున్నా. . నాకు అవమానం జరుగుతుందని తెలిసి కూడా కేసీఆర్‌ పట్టించుకోలేదు.. 2019 ఎన్నికల్లో నా ఓటమి వెనుక అంతర్గత కుట్ర ఉంది. .కేసీఆర్‌ను కలవాలంటే ఇప్పుడు తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి.. అంటూ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు నర్సయ్య గౌడ్.  రాజకీయ వెట్టి చాకిరిని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరన్న బూర..  బీసీలకు టికెట్‌ పరిశీలించమని అడగడం కూడా నేరమేనా?  అని ప్రశ్నించారు.


గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసిన బూర నర్సయ్య గౌడ్ శనివారం సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. శుక్రవారం ఉదమయే ఢిల్లీకి వెళ్లిన  బూర నర్సయ్య గౌడ్..  పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో రాత్రి చర్చలు జరిపారు, బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరితే.. మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి  షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Read Also: Boora Narsaiah Goud: బూర నర్సయ్య గౌడ్ జంప్.. నెక్స్ట్ ఎవరు? మునుగోడు టీఆర్ఎస్ లో కలవరం...


Read Also: Hyderabad Rain Alert:  హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. మరో రెండు రోజులు అలర్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook