Big Shock To Vyjayanthi Movies: వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. వరద చుట్టుముట్టడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం రెండు రాష్ట్రాల్లో సంభవించింది. ఆపత్కాలంలో బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు విరాళాలు అందిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు విరాళాలు అందిస్తుంటే ఒక్క కల్కి సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ మాత్రం అందరికీ షాకిచ్చింది. ముఖ్యంగా తెలంగాణ వారిని. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల కోసం వైజయంతి మూవీస్‌ భారీగా విరాళం ప్రకటించగా తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఈ వ్యవహరం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆ సంస్థ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్‌ సంస్థకు తెలంగాణ విద్యార్థులు హెచ్చరిక జారీ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలు


 


తెలంగాణ వరద బాధితుల కోసం వైజయంతి మూవీస్‌ విరాళం ప్రకటించకపోవడంతో తెలంగాణ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ వైజయంతి మూవీస్‌కు హెచ్చరికలు చేశారు. 'భారీ వర్షాలతో తెలంగాణ కూడా అతలాకుతలమైంది. 16 మందికి పైగా చనిపోయారు. వరద బీభత్సానికి ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపుగా లక్ష ఎకరాల్లో పంట నష్టమైంది' అని తెలిపారు. తెలంగాణలో చోటుచేసుకున్న వరదలపై సినీ పరిశ్రమపై వివక్ష చూపించడం క్షమించరానిదిగా పేర్కొన్నారు.

Also Read: Telangana Rains: తెలంగాణకు మళ్లీ ముప్పు.. మరో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన


 


'వైజయంతి మూవీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.25 లక్షలు విరాళం ఇవ్వడాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ తెలంగాణ వరదలపై స్పందన ఏది? తెలంగాణపై మీ వైఖరి ఏమిటి' అని శ్రీకాంత్‌ యాదవ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి విరాళం ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు. 'తెలంగాణ సంపదను కొల్లగొట్టి స్టూడియోల పేరుతో ఆంధ్ర పెత్తందారులు ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు లీజుకి తీసుకుని రూ.లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇది చాలదు అన్నట్లుగా అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇక్కడ సినిమాలు విడుదల చేసి అత్యధికం సంపాదిస్తున్న సినీ పరిశ్రమ వాళ్లు తెలంగాణను పట్టించుకోకపోవడం దారుణం' అని తెలిపారు.


'హుదూద్‌ తుఫాన్‌ సమయంలో సినీ పరిశ్రమ వారు ఏపీకి విరాళం ఇచ్చారు సంతోషమే. కానీ అప్పుడు హైదరాబాద్‌లో వరదలు వస్తే ఎవరూ స్పందించలేదు. ఎందుకు వివక్ష. ఇప్పుడు కూడా ఏపీకి విరాళం ఇస్తూ తెలంగాణను పట్టించుకోవడం లేదు' అని శ్రీకాంత్‌ యాదవ్‌ తెలిపారు. 'తెలంగాణ సంపద కొల్లగొట్టి రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్న వారు కష్టకాలంలో మాత్రం తెలంగాణకు సహాయం చేయరా?' అని ప్రశ్నించారు. 'సినీ పరిశ్రమల వారి తీరును మేం తప్పుబడుతున్నాం. సినీ పరిశ్రమ వారు స్పందించి తెలంగాణ వరద బాధితులకు  ఆర్థిక సహాయం చేయాలి' అని డిమాండ్‌ చేశారు.


'వైజయంతి మూవీస్‌కు 24 గంటలు సమయం ఇస్తున్నాం. ఏపీకి విరాళం ఇచ్చి తెలంగాణకు ఇవ్వకుండా వివక్ష చూపిన ఆ సంస్థ వెంటనే క్షమాపణలు చెప్పారు. తెలంగాణకు ఆర్థిక సహాయం ప్రకటించారు. లేకపోతే వైజయంతి మూవీస్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం' అని హెచ్చరించారు. 'తెలుగు సినీ పరిశ్రమ వారు స్పందించి కష్టాల్లో ఉన్న తెలంగాణకు వివక్ష లేకుండా ఆర్థిక సహాయం చేయాలి. లేకపోతే అన్ని స్టూడియోలను ముట్టడిస్తాం' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter