Telangana Rains: తెలంగాణకు మళ్లీ ముప్పు.. మరో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

Rain Alert To 11 Telangana Districts: తెలంగాణకు మళ్లీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 11 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 2, 2024, 07:51 PM IST
Telangana Rains: తెలంగాణకు మళ్లీ ముప్పు.. మరో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

Rain Alert To 11 Districts: కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తూ తెలంగాణ తడిసి ముద్దవుతుండగా సోమవారం కాస్త వరుణుడు తెరపినిచ్చాడు. అయితే మంగళవారం మరింత జోరుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని దాదాపు  11 జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షం ముప్పు నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లనురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  అప్రమత్తం చేశారు.

Also Read: KT Rama Rao: నా హైదరాబాద్‌ సేఫ్‌.. ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్‌

వర్షాల నేపథ్యంలో 11 జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో  సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను సమీక్షించారు. డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఫైర్ సర్వీసుల డీజీ నాగి రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో సమన్వయం చేశారు.

Also Read: Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?

అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో పోలీసు తదితర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశానారు.

స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సంరక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నిర్మల్‌కు 31 సభ్యులు, నాలుగు బొట్లు ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపుతున్నట్లు వివరించారు. ఎస్‌ఆర్‌ఎస్పీ పరీవాహక ప్రాంతాల్లో ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని తెలిపారు. మహారాష్ట్ర పరీవాహక ప్రాంతం నుండి వచ్చే నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని జాగ్రత్తలు చేపట్టేందుకు మహారాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

కల్వర్టులు, వాగుల వద్ద సంబంధిత లైన్ శాఖల అధికారులతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదారాబాద్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కలెక్టరేట్‌లలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌లు 24/7 పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలు ఇవే!
ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News