Telangana Elections: రేవంత్ సర్కార్‌కు భారీ షాక్.. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా?
High Court Orders Enumeration Of BCs Within Three Months These Effect Local Bodies Poll Postpone: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. హైకోర్టు రంగంలోకి దిగడంతో ఎన్నికలు కొన్ని నెలలు వాయిదా పడే అవకాశం ఉంది.
Telangana High Court: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఎన్నికలు త్వరలో చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుండగా ఈ వ్యవహారంలో హైకోర్టు కల్పించుకోవడంతో బిగ్ షాక్ తగిలింది. బీసీ గణన త్వరగా చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బీసీ గణన చేపట్టాక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. అనంతరం ఈ విచారణను మూడు నెలలకు వాయిదా చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో తెలంగాణలో మూడు నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు అవకాశం కనిపించడం లేదు.
Also Read: By Election: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్‌ఎస్ పార్టీలో జోరు, కాంగ్రెస్‌లో బేజారు
బీసీల గణన పూర్తయ్యే వరకు తెలంగాణలో జెడ్పీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించవద్దని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. తాజాగా మంగళవారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకుంది. విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదిస్తూ.. 'రాష్ట్రంలో బీసీల గణన పూర్తి చేసేందుకు 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది' అని ప్రభుత్వం తరఫున కోర్టుకు తెలిపారు. 'స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రాష్ట్రంలో బీసీల గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది' అని న్యాయస్థానానికి విన్నవించారు.
Also Read: MLA Defection Case: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..
ప్రభుత్వ వాదన విన్న ధర్మాసనం బీసీ గణన త్వరగా చేపట్టాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ సీజే అలోక్ ఆరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ వాదనలు వినిపించింది. ఈ పిటిషన్‌పై తదుపరి తీర్పును 3 నెలలకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థలు మరికొన్నాళ్లు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. బీసీ కుల గణన పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు జరనున్నాయి.
రేవంత్ సర్కార్‌కు షాక్
లోక్‌సభ ఎన్నికల ఉత్సాహంతో స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. ఎన్నికలు కొన్ని వారాల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా అనూహ్యంగా న్యాయస్థానం రంగంలోకి దిగడంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఐదారు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందు బీసీ గణన చేపట్టాల్సి ఉంది. బీసీ గణన అనంతరం అందులో వచ్చిన లెక్కల ప్రకారం స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఇదంతా జరిగేందుకు కొన్ని దాదాపు మూడు నుంచి 4 నెలలు పట్టనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ముందుకు జరగనున్నాయి. అయితే హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎన్నికలకు కొన్ని నెలలు ఆలస్యం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.