Congress Politics: కేబినెట్ విస్తరణలో ట్విస్ట్.. నలుగురే కొత్త మంత్రులు!
Revanth reddy: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సమయం అసన్నమైందా..! రెండుమూడు రోజుల్లో కొత్త మంత్రులను ప్రకటించబోతున్నారా..! మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోబోయే నేతలెవరు..! కేబినెట్‌లో రేవంత్ మార్క్ ఉండబోతోందా..! `ఈ సారి కేవలం నలుగురు నేతలకే అవకాశం కల్పిస్తున్నారా..! మరి ఆ రెండు పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారు..!
Revanth reddy: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి కావొస్తోంది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది పూర్తవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. అయితే డిసెంబర్ తొమ్మిదో తేదీ నాటికి మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లోనే కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈసారి మంత్రివర్గం రేసులో చాలా మంది నేతలు ఉన్నప్పటికీ.. నలుగురికి మాత్రమే చోటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో 12 మందికి తొలివిడతలో చోటు కల్పించారు. ఆరు పదవులను మాత్రం భర్తీ చేయకుండా నిలిపివేశారు. ఈ ఏడాది ఆషాడంలోనే మంత్రివర్గ విస్తరణపై ఊహగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత శ్రావణం ముగిసిన ఎవరికి కొలువులు రాలేదు.. చివరకు మహారాష్ట్ర ఎన్నికలు ముగిసినా నేతలకు కొలువులు దక్కలేదు. చివరకు కేబినెట్‌లో కొత్త నేతలకు అవకాశం కల్పించడంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది. అయితే ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణపై నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు. కానీ ఈ అంశాన్ని సీఎంకే వదిలివేయడంతో రెండుమూడు రోజుల్లో ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు లేదు. దాంతో ముందు ఈ నాలుగు జిల్లాల్లో ఒక్కో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. హైదరాబాద్ కోటాలో ఓ నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తనకు హైదరాబాద్ కోటాలో చోటు కల్పించాలని కోరుతున్నారట. అటు కోదండరామ్, షబ్బీర్ అలీ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోందట. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు నేతల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందట. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రివర్గంలో బెర్త్ కన్‌ఫర్మ్ అంటున్నారు..
అటు నిజామాబాద్ జిల్లాలో కోటాలో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖాయమని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో సుదర్శన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పూర్తి హామీ దొరికినట్టు సమాచారం. ఇక ఆదిలాబాద్ జిల్లా కోటాలో ఇద్దరు పేర్లు తొలి నుంచి వినిపిస్తున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మరో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్టు గా పోటీ జరుగుతోందట. అయితే వివేక వెంకటస్వామి ఎస్సీకోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. అటు ప్రేమ్ సాగర్ రావు కూడా వెలమ కోటాలో తనకు హామీ దొరికిందని అంటున్నారు. ఒకవేళ మైనంపల్లి రోహిత్ కు వెలమ కోటాలో చోటు దక్కని పక్షంలో ప్రేమ్ సాగర్ రావుకు చోటు దక్కొచ్చని చెబుతున్నారు.
ఇక నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, బాలు నాయక్ పేర్లను సైతం హైకమాండ్ పరిశీలిస్తోందట. ఈ ఇద్దరు నేతల్లో ఒకరికి చాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తోందట. మరోవైపు బీసీ కోటా నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహారి ముదిరాజ్ పేరు తొలినుంచి వినిపిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన శ్రీహారికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అంటున్నారు. ఇదే సమయంలో మరో వాదన సైతం తెరమీదకు వస్తోంది. పటాన్ చెరుకు చెందిన నీలం మధు ముదిరాజ్‌కు చోటు కల్పించే ఆలోచన సైతం చేస్తున్నారు. నీలంమధును ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చెబుతున్నారు. నీలం మధుకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుతున్నట్టు సమాచారం.
మరోవైపు ఈ విడతలో కేవలం నలుగురు నేతలకు చోటు కల్పిస్తుండటంతో మరికొందరు నేతలు నారజ్ అయ్యే చాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తోందట. అందుకే రెండు సీట్లను ఖాళీగా ఉంచబోతున్నట్టు తెలుస్తోంది. అసంతృప్త జ్వాలలు అనూహ్య రీతిలో పెరిగితే ఆ రెండు సీట్లలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు రెండు ఖాళీలు ఉంచబోతున్నారట. మరోవైపు పదవులు దక్కని నేతలకు నామినేటెడ్ పోస్టులపైన హామీ ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంగా రెండుమూడు రోజుల్లో కేబినెట్ బెర్త్‌లు కన్‌ఫర్మ్ అవుతాయన్న సమచారంతో నేతల్లో హాడావుడి ఎక్కువైందట. ఇప్పటికే ముఖ్యమంత్రిని కొందరు నేతలు కలిసి తమ పేరును పరిశీలించాలని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరు నేతలు ఢిల్లీ నుంచి కూడా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది..
Also Read: Revanth Reddy: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిందే! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read: Varun Tej Visits Kondagattu: కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా హీరో వరుణ్ తేజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.