Bihar Assembly opposition and RJD leader Tejashwi Yadav meets Telangana CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో బిహార్ ఆర్జేడీ (RJD) యువనేత తేజస్వి యాదవ్ (RJD leader Tejashwi Yadav) భేటీ అయ్యారు. కేసీఆర్‌‌ను (KCR) కలిసిన ఆర్జేడీ ప్రతినిధుల (RJD leaders) బృందం జాతీయ రాజకీయాలపై చర్చించింది. తెలంగాణలో (Telangana) అమలవుతున్న పథకాలపై వారు ఆరా తీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో (pragathi bhavan‌) తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నాయ‌కుడు, బిహార్ విప‌క్ష నేత తేజ‌స్వి యాద‌వ్ (Tejashwi Yadav) భేటీ అయ్యారు. మంగ‌ళ‌వారం జరిగిన ఈ భేటీలో జాతీయ రాజ‌కీయాల‌తో పాటు పలు అంశాలపై తేజ‌స్వి యాద‌వ్‌తో సీఎం కేసీఆర్‌‌ (CM KCR‌‌) చ‌ర్చించారు. 


దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, థర్డ్‌ ఫ్రంట్‌పై (Third Front) కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ చర్చించారు. అలాగే తాజాగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించారని సమచారం. కేసీఆర్‌, తేజస్వి యాదవ్ (KCR, Tejashwi Yadav) భేటీలో ప్రధాన చర్చ ఇదేనట. 



 


Also Read : AP corona updates: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు


ప్రగతిభవన్‌కు వచ్చిన తేజ‌స్వి యాద‌వ్‌కు (Tejashwi Yadav) ముందుగా సీఎం కేసీఆర్‌‌తో పాటు మంత్రి కేటీఆర్ (Minister KTR) తదితర నేతలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కేసీర్‌‌ను కలిసిన తేజస్వి యాదవ్‌ బృందంలో నేతలు అబ్దుల్ సిద్దిఖీ, సునీల్ సింగ్ తదితరులు ఉన్నారు. బిహార్ విపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.ఇక ఈ మధ్యే లెఫ్ట్‌ పార్టీల (Left parties) జాతీయ నేతలతో సీఎం కేసీఆర్‌ చర్చలు చేపట్టిన విషయం తెలిసిందే. కేసీఆర్‌‌తో సీపీఐ, సీపీఎం జాతీయ అగ్రనేతలు ఇటీవల ప్రగతిభవన్‌లో (pragathi bhavan) సమావేశమైన సంగతి తెలిసిందే. వేర్వేరుగా జరిగిన ఆ సమావేశాల్లో జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణ (Telangana) అభివృద్ధి తదితర అంశాలపై చర్చ సాగింది. ఇక తాజాగా ఇప్పుడు తేజ‌స్వి యాద‌వ్‌తో (Tejashwi Yadav) కేసీఆర్ (KCR‌‌) జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు.


Also Read : Keerthy Suresh: నటి కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook