Khammam: ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరు చెప్పలేరు. కొన్ని ప్రమాదాలు జరిగే తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఊహించని సంఘటన ఖమ్మం(Khammam)లో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
ఖమ్మం నగరంలోని రావిచెట్టు బజార్‌లోని బట్టల దుకాణం(Cloth Store)లోకి ఓ బైక్ దూసుకెళ్లింది. ఈ ఘటనతో దుకాణంలో ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నట్టుండి దుకాణంలోకి బైక్‌(Bike) రావడంతో ఏం జరిగిందో అర్థంకాక వారికి వెన్నులో వణుకు పుట్టింది. షాపులోకి వచ్చిన బైకు అక్కడ ఉన్న బట్టలను ఢీకొట్టి ఏకంగా కౌంటర్‌ వద్దకు చేరి కింద పడిపోయింది. 


Also Read: Karnataka: కుటుంబం పరువు పోయిందని.. ఐదుగురు బలవన్మరణం


ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బైక్‌ నడిపిన వ్యక్తి కూడా క్షేమంగా బయటపడ్డాడు. వాహనం వేగానికి దుకాణంలోని కౌంటర్‌ను ఢీకొట్టి ఎగిరిపడ్డాడు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనం బ్రేకులు ఫెయిల్‌(Break Fail) కావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook