Bandi Sanjay On TSPSC Paper Leakage: 'పేపర్ లీకేజీ బాధ్యుడు నీ కొడుకే.. టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే.. మరి ఆయనను బర్తరఫ్ చేస్తారా..? లోపలేసి తొక్కే దమ్మ  కేసీఆర్‌కు ఉందా..?' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై జరిగిన పోరాటంలో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం నాయకులను గురువారం బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ విషయంలో తెలంగాణలోని లక్షలాది యువత తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్‌తోపాటు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి.. జైలుకు పంపడం దుర్మార్గం. ఏడుగురు కార్యకర్తలను జైల్లో వేశారు.. లీకేజీపై ప్రశ్నించడమే వారు చేసిన తప్పు.. లీకేజీ నేరస్తులకు రాచ మర్యాదలు చేస్తున్నారు. 
 
అసలు పేపర్ లీకేజీ ఎట్లా అయింది..? టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌కు తెలియకుండా ఎట్లా లీకైంది..? ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలి. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారు. మియాపూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్‌లు ఏమయ్యాయి..? కేసీఆర్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండే. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ కొడుకు పాత్ర క్లియర్‌గా ఉంది. ఐటీశాఖ ఫెయిల్యూర్ ఉంది. అయినా కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదు. కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త డ్రామా చేస్తున్నడు.. బీజేపీ పాత్ర ఉందని సిగ్గు లేకుండా ఆరోపిస్తున్నారు.. రాజశేఖర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడని అంటున్నారు.. 2017 నుంచి అతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఉద్యోగి. ఐటీశాఖ పరిధిలో ఉంటుంది. మరి ఇన్నాళ్లు ఏం చేస్తున్నట్లు..? అట్లాంటివాళ్లను గుర్తించడం చేతగాని నువ్వు మంత్రిగా ఉండటానికే అనర్హులు..' అని బండి సంజయ్ అన్నారు.
 
పరీక్షలు కూడా నిర్వహించలేని చేతగానితనం కేసీఆర్ సర్కార్‌దంటూ ఫైర్ అయ్యారు. కనీసం టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించడం చేతగావడం లేదని విమర్శించారు. దొంగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ శాఖ కేసీఆర్ కొడుకు వద్దే ఉందని.. మరి ఆయనను బర్తరఫ్ చేస్తారా..? అని ప్రశ్నించారు. తక్షణమే జరిగిన పరిణామాలకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలన్నారు. 


Also Read: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీకి షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!  


Also Read: AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి