AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..

AP Budget Allocation 2023: ఎన్నో అంచనాల నడుమ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.  రూ.2 లక్షల 79 వేల 279 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అంతకుముందు టీడీపీ సభ్యులు బడ్జెట్‌ ప్రసంగాన్ని అడ్డుకోగా.. వారిని సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 01:55 PM IST
AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..

AP Budget Allocation 2023: ప్ర‌జా సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79 వేల 279 కోట్లతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా ఉందని తెలిపారు. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్య లోటు రూ.54,587 కోట్లుగా ఉందన్నారు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతంగా ఉందని వెల్లడించారు. 

బుగ్గన బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టే సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత టీడీపీ సభ్యులు తమ అభిప్రాయం తెలపాలని.. ఇలా ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని స్పీకర్ తమ్మినేని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు వినకుండా స్పీకర్ పోడియం చుట్టు చేరి పేపర్లు చించి వేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వాళ్లను సభ నుంచి బయటకు పంపించిన తరువాత బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఐదోసారి ఆయన బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..

==> వైఎస్ఆర్‌ పెన్షన్‌ కానుక​‍-రూ.21,434.72 కోట్లు
==> వైఎస్ఆర్‌ రైతు భరోసా-రూ.4,020 కోట్లు
==> జగనన్న విద్యాదీవెన-రూ.2,841.64 కోట్లు
==> జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
==> వైఎస్ఆర్‌-పీఎం బీమా యోజన-రూ.1600 కోట్లు
==> డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
==> రైతులకు వడ్డీలేని రుణాలు-రూ.500 కోట్లు
==> వైఎస్ఆర్‌ కాపు నేస్తం-రూ.550 కోట్లు
==> జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
==> వైఎస్ఆర్‌ వాహనమిత్ర-రూ.275 కోట్లు
==> వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
==> వైఎస్ఆర్‌ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు
==> మత్స్యకారులకు డీజీల్‌ సబ్సీడీ-రూ.50 కోట్లు
==> రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
==> లా నేస్తం-రూ.17 కోట్లు
==> జగనన్న తోడు-రూ.35 కోట్లు
==> ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు
==> వైఎస్ఆర్‌ కల్యాణమస్తు-రూ.200 కోట్లు
==> వైఎ‌స్ఆర్‌ ఆసరా-రూ.6700 కోట్లు
==> వైఎస్ఆర్‌ చేయూత-రూ.5000 కోట్లు
==> అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు
==> మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
==> ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు
==> వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు
==> మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
==> జగనన్న విద్యా కానుక-రూ.560 కోట్లు
==> పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి-రూ.15,873 కోట్లు
==> పురపాలక,పట్టణాభివృద్ధి-రూ.9,381 కోట్లు
==> స్కిల్‌ డెవలప్‌మెంట్‌-రూ. 1,166 కోట్లు
==> యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ-రూ.1,291 కోట్లు
==> షెడ్యూల్‌ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు
==> షెడ్యూల్‌ తెగల సంక్షేమం-రూ.6,929 కోట్లు
==> వెనుకబడిన తరగతుల సంక్షేమం​-రూ.38,605 కోట్లు
==> కాపు సంక్షేమం​-రూ.4,887 కోట్లు
==> మైనార్టీల సంక్షేమం-రూ.4,203 కోట్లు
==> పేదలందరికీ ఇళ్లు-రూ.5,600 కోట్లు
==> పరిశ్రమలు, వాణిజ్యం-రూ.2,602 కోట్లు
==> రోడ్లు, భవనాల శాఖ-రూ.9,118 కోట్లు
==> నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)-రూ.11,908 కోట్లు
==> పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ-రూ.685 కోట్లు
==> ఎనర్జీ-రూ.6,456 కోట్లు
==> గ్రామ, వార్డు సచివాలయ శాఖ-రూ.3,858 కోట్లు
==> గడపగడకు మన ప్రభుత్వం-రూ.532 కోట్లు

అంతకుముందు టీడీపీ సభ్యులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారని.. ప్రసంగానికి అడ్డుపటడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సిఫార్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. 

Also Read: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీకి షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!  

Also Read: Rishabh Pant: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. పంత్ లేటెస్ట్ వీడియో చూశారా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News