JP Nadda: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ప్రచారాన్ని స్పీడ్‌ పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్‌ నడ్డా భువనగిరి లోక్‌సభ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించారు. చౌటుప్పల్‌లో సోమవారంత జరిగిన ప్రచార సభలో నడ్డా కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీపై కూడా విమర్శలు చేశారు.
Also Read: K Kavitha Bail: కవితకు భారీ షాక్.. రెండు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జన సభలో జేపీ నడ్డా పాల్గొని మాట్లాడారు. 'నరేంద్ర మోదీ నేతృతంలో దేశంలో బీజేపీ ముందుకు పోతుంది. మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశం విలువలను పదేళ్లు పెంచాడు. మోడీ ఉద్దేశం ఒక్కటే దేశ అభివృద్ధి' అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని  చూస్తున్నారని ఆరోపించారు. మోడీ మంత్రం 'సబ్ కా సాత్ సాబ్ కా వికాస్' అని పేర్కొన్నారు.

Also Read: KTR Road Show: ఓటుకు కాకుండా టూర్లకు వెళ్లితే మీకే నష్టం.. హైదరాబాద్‌వాసులకు కేటీఆర్‌ హెచ్చరిక


ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న  మోదీ ఒక్క ఫోన్ కాల్‌తో మన విద్యార్దులను స్వదేశానికి తీసుకువచ్చారని జేపీ నడ్డా తెలిపారు. మూడో సారి మోడీ ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. మొబైల్ రంగం మేక్ ఇన్ ఇండియా ద్వారా మనమే తయారు చేస్తున్నామని వివరించారు. మహిళలు, యువకులు, రైతులకు మోదీపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.


'తెలంగాణలో రెండు కోట్ల మందికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నాం. ఉజ్వల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇండ్లు అందిస్తాం. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తాం' అని నడ్డా వివరించారు. మోడీ తెలంగాణ వికాస్ కోసం  రైల్వే లైన్లు ఎక్కువ అందించారని చెప్పారు. హైదరాబాద్, విశాఖపట్టణానికి  గ్రీన్ కారిడార్‌ను అందిస్తామని ప్రకటించారు. 


'కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2జీ స్కాం, ఆహార స్కాం, బొగ్గు స్కాం ఎన్నో కుంభకోణాలు చేశారు' అని కాంగ్రెస్‌పై నడ్డా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు దొంగే దొంగ అన్నటు ఉన్నదని ఎద్దేవా చేశారు. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని.. మతం పేరు మీద ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎప్పటి వరకు బీజేపీ ఉంటుందో  అప్పటి వరకు రిజర్వేషన్లు ఎవరూ మార్చలేరని చెప్పారు. అభివృద్ధి వ్యతిరేకి కాంగ్రెస్ అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter