BJP Dharmapuri Arvind sensational comments On Former CM KCR: బీజేపీ నిజామాబాద్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీనీ కాస్తంత కంట్రోల్ చేయగలిగారని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి అంత సినిమాలేదంటూ ఎద్దెవా చేశారు. సీఎం రేవంత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. బీజీపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటుప్రజల్ని మోసం చేశాడన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఎక్కువగా నమ్మించి మోసంచేసిందన్నారు. దీంతో మైనారిటీ ఓట్లన్ని కాంగ్రెస్ కు పడ్డాయని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ దేశంలో బీజేపీ హావా, పీఎం మోదీ హవాలను ఆపడం కాంగ్రెస్ చాతకాదని, తొందరలోనే కాంగ్రెస్  పూర్తిగా ఖాళీ అయిపోతుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Vampire Facial: వామ్మో.. ఫెషియల్ చేసుకున్న మహిళలకు హెచ్ఐవీ.. అసలేం జరిగిందంటే..?


అంతేకాకుండా.. సీఎం రేవంత్ రెడ్డి తొందరలోనే కాషాయ కండువ కప్పుకుంటాడని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దెవా చేశారు. ఇదిలా ఉండగా.. ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగామారాయి. ఎన్నికల వేళ ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీని ప్రజల్లో ఇరకాటం పెట్టేదిగా ఉన్నాయంటూ కూడా కొందరు నేతలు అనుకుంటున్నారంట.


బీఆర్ఎస్ కు ఇది మైలేజీ అవుతుదంటూ కూడా అర్వింద్ తీరును తప్పుపడుతున్నారు.  ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలోరాజకీయాలు మాత్రం సమ్మర్ హీట్ నుమరింతగా పెంచుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కన్పించిన ప్రతి దేవుడి మీద ఓట్లు వేసుకుంటూ ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానంటూ బల్ల బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.


Read More: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..


ఇక దీనిపై ఎమ్మెల్యే హరీష్ రావు.. గన్ పార్క్‌ వద్దకు వెళ్లి, తన రాజీనామా పత్రాన్ని కూడా అక్కడ మేధావులకు అందజేశారు. దీనిపై సీఎం రేవంత్ కూడా ఘాటుగానే స్పందించారు. హరీష్ రావు సిద్ధంగా ఉండాలంటూ కౌంటర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలలో సీట్లు గెలవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారంలను మాత్రం ముమ్మరం చేశారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter