Amit Shah Telangana Tour: తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీకి మధ్య విడదీయరాని బంధం ఉంది. 2014 ఎన్నికలకు హైదరాబాద్‌ గడ్డ నుంచే మోదీ సమరశంఖం పూరించారు. 2019లోనూ అదే చేశారు. ఈసారి కూడా అలాగే చేసే యోచనలో ఉన్నారు. తెలంగాణ నుంచే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన చేపట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా అమిత్‌ షా పర్యటన ఉండనుంది. ఈ మేరకు షా తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. మొదట మహబూబ్‌నగర్‌లో, అనంతరం కరీంనగర్‌, హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు బీజేపీ ఇప్పటికే ప్రణాళిక రచించింది. లోక్‌సభ స్థానాలను 143 క్లస్టర్స్‌గా విభజించింది. వాటిలో తెలంగాణలోని 17 నియోజకవర్గాలను 5 క్లస్టర్స్‌గా విభజన చేసింది. దేశంలోనే మొదటి క్లస్టర్‌ సమావేశం ఈనెల 28వ తేదీన అమిత్‌ షా ప్రారంభించనున్నారు.


డబుల్ సీట్లే లక్ష్యం
గత ఎన్నికల్లో పార్టీ ఊహించని రీతిలో నాలుగు స్థానాలను సొంతం చేసుకుంది. ఈసారి డబుల్‌ కావాలని కమల దళం భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనికి క్లస్టర్‌ సమావేశంలో అమిత్‌ షా దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎనిమిది స్థానాలు ఉన్న పార్లమెంట్‌ నియోజకవర్గాలపై కూడా ప్రధాన దృష్టి సారించనుంది. అసెంబ్లీ ఫలితాలను పక్కనపెట్టి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాలు కనిపించవని.. జాతీయ ప్రాధాన్యాలు ప్రజలు గమనిస్తారని ఆ పార్టీలో చర్చ జరిగింది. ప్రధాని మోదీ చరిష్మా, అయోధ్య ఆలయం ఎన్నికల్లో పార్టీకి గెలుపు అవకాశాలు తీసుకొస్తుందని పార్టీ అధిష్టానం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. తెలంగాణలో కూడా వాటినే అస్త్రాలుగా చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. అందులోనే భాగంగా అమిత్‌ షా పర్యటన ఉందని తెలుస్తోంది.


అమిత్‌ షా షెడ్యూల్‌
హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో మధ్యాహ్నం 1.10కి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు మహబూబ్‌నగర్‌లోని సుదర్శన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించే క్లస్టర్‌ సమావేశానికి హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు కరీంనగర్‌ బయల్దేరుతారు. కరీంనగర్‌లోని రాజరాజేశ్వర కళాశాలలో జరిగే సమావేశంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పాల్గొంటారు. కరీంనగర్‌ నుంచి 5.15 గంటలకు బయల్దేరి హైదరాబాద్‌ చేరుకుంటారు. జేఆర్సీ కన్వెన్షన్‌ హాలులో సాయంత్రం 6.15 నుంచి 7.15 గంటల వరకు సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి బేగంపేటకు చేరుకుని 7.45 నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయనున్నారు.


Also Read: KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు
 


Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook