తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానికొకటి స్లీపర్ సెల్స్ గా వ్యవహరిస్తున్నాయని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం అన్నారు. ఈ రెండు పార్టీలు అవగాహన ఒప్పందం కుదుర్చుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాపార భాగస్వాములేనంటూ దుయ్యబట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో బిజెపి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు గారు, బిజెపి పార్లమెంట్ కార్యాలయ మాజీ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ గారు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా జాఫర్ ఇస్లాం మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కేసీఆర్ వ్యవహారం మొత్తం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలపై రాహుల్ గాంధీ కపట ప్రేమ చూపిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. ఒకరికి ఒకరు స్లీపర్ సెల్ గా పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసుపై కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదు.. రేవంత్ రెడ్డి కేసీఆర్ కూతురు ఇద్దరు వ్యాపార భాగస్వాములు కాదా..? 2018 ఎన్నికల్లో ఒప్పందంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు.. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎవ్వరికి టిక్కెట్ ఇవ్వాలో కేసీఆర్ నిర్ణయిస్తున్నారు.


Also Read: Adikeshava Release Date: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. 'ఆదికేశవ'మూవీ రిలీజ్ వాయిదా  


అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసిపోతాయి.. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాటకాలను, రాజకీయ ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారు.


Also Read: Pushpa 2:పుష్ప కొత్త షెడ్యూల్.. జాతర ఫైట్ తో మొదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..