Etela Rajender Fires on CM KCR: నిర్మల్‌లో వందలమంది మహిళలను మగ పోలీసులు విపరీతంగా కొట్టారని.. రక్తం కారుతున్నా వదిలిపెట్టలేదని మహేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి తనకు చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపార. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు, నాయకుల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నారని.. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ చెప్పినట్లుగా పనిచేస్తున్నారు అని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఒకనాడు లంబాడ తండాలలో లంబాడాలు పిల్లలను అమ్ముకొని బతుకుతున్నారని చెప్పిన కేసీఆర్.. అదే లంబాడ మహిళల మీద పోలీసులు చేసిన దౌర్జన్యానికి పాల్పడితే.. వారిమీద చర్యలు తీసుకోకుండా.. ఆమె మంచిది కాదు అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ లంబాడ తల్లులు పిల్లలను సాదలేక ఇలాంటి పనికి ఒడిగడుతున్నారని మీరు చెప్పదలుచుకున్నారా కేసీఆర్..? లంబాడా తల్లుల శీలాన్ని కేసీఆర్ శంకిస్తున్నారు. మీ దుర్మార్గాన్ని ఆ మహిళలు అర్థం చేసుకుంటారు.


మరియమ్మ అనే దళిత మహిళను యాదాద్రి భువనగిరి జిల్లా  అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో పెట్టి విపరీతంగా కొడితే చనిపోయింది. దానిమీద ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఖమ్మంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు పోలీస్ వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఉత్తరం రాసిపెట్టి చనిపోతే కూడా ఇంతవరకు దానిమీద ఎలాంటి యాక్షన్ లేదు. కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్, బీజేపీ ఐటీ సెల్‌లో పనిచేసే బొమ్మ శరత్‌ను మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుపోయి బయట ప్రాంతాల్లో తిప్పి విపరీతంగా కొట్టిన సందర్భాలను అందరూ గమనిస్తున్నారు. హుజురాబాద్‌లో చెల్పూరు సర్పంచ్ మహేందర్‌ను పోలీసులు అకారణంగా కొట్టడమే కాకుండా.. ఆ దెబ్బలకు తట్టుకోలేక అరుస్తుంటే ఫోన్ చేసి ఆ నాయకులకు వినిపించడం.. వీడియోలు తీసి చూపించి వికటాట్టహాసం చేయడం చూస్తున్నాం.." అని అన్నారు.


గిరిజన, దళిత మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదన్నారు ఈటల. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు మీద కేసీఆర్ దుర్మార్గాలు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంకో మూడు నెలలు మాత్రమే ఉంటుందని.. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అన్నట్లు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని అన్నారు. పోలీసులకు కూడా రాజరికపు ఆదేశాలు పాటించి చట్టానికి వ్యతిరేకంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తే తప్పకుండా మీకు పనిష్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా మీ ప్రవర్తన, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. 


Also Read:  IND vs IRE 2nd T20 Updates: ఐర్లాండ్‌తో రెండో టీ20.. మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి..? పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!   


Also Read: Ketika Sharma: పొట్టి నిక్కర్‌లో బ్రో బ్యూటీ సందడి.. కేతిక శర్మ ఖతర్నాక్ పోజులు చూశారా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook