TRS VS BJP: తెలంగాణ రాజకీయాల్లో  వలసల సీజన్ నడుస్తోంది. కొంత కాలంగా నేతల వలసలు తగ్గిపోగా.. మళ్లీ ఆపరేషన్ ఆకర్శ్ కు తెర తీశారు సీఎం కేసీఆర్.మునుగోడు ఉప ఎన్నికల వేళ ఉద్యమకారులను తిరిగి సొంత గూటికి రప్పిస్తున్నారు. మునుగోడు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం సంచలనమైంది. బూర కమలం గూటికి చేరిన వెంటనే అప్రమత్తమైన కేసీఆర్.. ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు. దీంతో బీజేపీ నేతలు వరుసగా కారెక్కేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. త్వరలో మరికొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్  కీలకంగా వ్యవహరించి .. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న నేతలతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయానికి చేరికలు జోరందుకుంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కమలం పార్టీని పరేషాన్ చేస్తోంది. దీంతో  కారు పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాల్లో బీజేపీ నేతలు ఉన్నారని సమాచారం. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి వాళ్లతో బీజేపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. త్వరలోనే కొందరు కీలక నేతలకు కాషాయ కండువా కప్పడం ఖాయమంటున్నారు. శనివారం మునుగోడులో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వలసలపై కీలక వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ తమతో టచ్ లో ఉన్నారంటున్నారు. ఇనుము వేడిలో ఉన్నప్పుడే  వంచాలన్న ఉద్దేశంతో వాళ్లంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. కండువా కప్పి మీ పక్కన కూర్చోబెట్టుకొంగనే మీ వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ మేమె మీవద్దకు పంపి ఉండవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. త్వరలోనే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తులు వస్తున్నాయి. దీంతో గులాబీ గూటికి చేరబోయే ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవలే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కమలం పార్టీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జంపింగ్ వార్తలను ఖండించారు.


మరోవైపు సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 20 ఏళ్ల కాలంలో కేసీఆర్‌తో పెట్టుకుని బతికి బట్ట కట్టిన వాడు ఎవడు లేరన్నారు. తానొక్కడినే కేసీఆర్ కుట్రలను తట్టుకుని నిలబడ్డానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం పగిడిపల్లి‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. మునుగోడు నుండి పగిడపల్లికి రావడానికి మూడున్నర గంటల సమయం పట్టిందని అన్నారు రాజేందర్. హుజురుబాద్ లో 30 ఏళ్ల క్రితం ఇలాంటి రోడ్లు చూశామని తెలిపారు. కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న బంగారు తెలంగాణ ఎలా ఉందో  మునుగోడును చూస్తే తెలుస్తుందన్నారు ఈటల రాజేందర్.


Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు షాక్.. మూడు పెళ్లిళ్లపై మహిళా కమిషన్ నోటీస్


Read Also: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి మరో వీడియో లీక్.. మునుగోడు గ్రౌండ్ రిపోర్ట్ చెప్పేశాడు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook