Hyderabad Old City: నిఘా నీడలో పాతబస్తీ.. పెట్రోల్ బంకు, షాపులు బంద్!
Petrol Bunks closed in Old City at Hyderabad. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
Petrol Bunks and Shops closed in Old City at Hyderabad: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ అట్టుడుకుతోంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. చార్మినార్ వద్ద యువత భారీగా చేరుకుని పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో.. వారు లాఠీఛార్జ్ చేశారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. చాలా ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్ధృతంగా సాగాయి.
ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతంలో పోలీసులు, పారా మిలటరీ దళాలు భారీగా మోహరించాయి. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదోళనకారులు విధ్వంసానికి పాల్పడకుండా చర్యలు తీసుకున్నారు. పలువురు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
పోలీసుల హెచ్చరికతో పాతబస్తీలోని షాపులను మూసివేశారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు కూడా మూతపడ్డాయి. పోలీసులు హెచ్చరించినా.. కొందరు షాపు యజమానులు తెరిచే ఉంచారు. దాంతో పోలీసులు హెచ్చరించి మరీ మూయించారు. పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆంక్షలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా తేల్చి చెప్పారు.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 749కే రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్!
Also Read: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలుపు ఎవరిది.. ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చిన అఫ్రిది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook