Bandi Sanjay kumar : ఎంపీ బండి సంజయ్ చేతికి అందుకే తెలంగాణ బీజేపి పగ్గాలు ఇచ్చారా ?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే ఓ లేఖ విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే ఓ లేఖ విడుదల చేశారు. టీఆర్ఎస్ గాలి బలంగా వీస్తున్న సందర్భంలోనూ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపి ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. ఆ తర్వాత కాలంలో యువతలో పట్టు పెంచుకోవడంలో విజయం సాధించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే... కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకొచ్చిన చట్టాలకు ప్రచారం కల్పించడంలోనూ బండి సంజయ్ కృషిచేశారు.
[[{"fid":"183037","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
బీజేపీ అధిష్టానంతో పాటూ ఆర్ఎస్ఎస్‌తోనూ సత్సంబంధాలున్న నేత కావడం.. తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ అంతటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వంటివి పార్టీ అధ్యక్షుడిగా నియమితులవడంలో బండి సంజయ్‌కి అనుకూలంగా మారాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..