అజ్ఞాతంలోకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్?
గత కొన్ని రోజుల నుండి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో నిర్విరామంగా గడిపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? వ్యక్తి గత సెక్యూరిటీకి కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అయన భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎంపీ సంజయ్ ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు.
కరీంనగర్: గత కొన్ని రోజుల నుండి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో నిర్విరామంగా గడిపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? వ్యక్తి గత సెక్యూరిటీకి కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అయన భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎంపీ సంజయ్ ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి జరిగిందని బండి సంజయ్ చెబుతుండగా అలాంటిది ఏమీలేదని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కొట్టిపారేశారు. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. కాగా నిన్న రాత్రి బీజేపీ గాయత్రిపై టీఅర్ఎస్ దాడి చేయగా ఆ విషయమై పోలీస్ లతో చర్చించగా వివాదం మరింత ముదిరిందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా ఆయనకు భద్రతా కల్పిస్తానన్న అయన వద్దని వారించడం, పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడంతో గత కొద్దీ రోజులుగా పోలీసు ఉన్నతాధికారికి, ఎంపీకి మధ్య వివాదం తీవ్రమైన నేపధ్యంలో ఎంపి సంజయ్ విశ్రాంతి కొరకు అన్నిటికి దూరంగా వెళ్ళారా లేదా పోలీస్ అధికారితో వివాదం కారణంగా అజ్ఞాతంలోకి వెళ్ళాడా అనే ప్రశ్న బీజేపీ కార్యకర్తల్లో కలుగుతుంది.
మరోవైపు కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో శుక్రవారం జరుగనున్న ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు. గురువారం ఎన్నికల సందర్భంగా ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అధికారిణి శ్రీదేవి, పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ స్టేషన్లవారీగా పోలింగ్ సామాగ్రిని అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థలో 60 డివిజన్లకు గాను 2 ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 58 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..