Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బండి సంజయ్. మూడోసారి కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఇక అంతేనని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను చూస్తుంటే దండుపాళ్యం ముఠా గుర్తుకువస్తుందన్నారు.
Bandi Sanjay Slams CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేశాడని.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడని.. మూడోసారి వస్తే ఇక అంతేనని అన్నారు. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో.. కేసీఆర్ సీఎం అయితే అంతకంటే డేంజర్ అని అన్నారు. ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే తప్ప.. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూస్తే దండు పాళ్యం ముఠా గుర్తుకొస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు. అధికారం ఇస్తే.. నట్టేట ముంచిన బీఆర్ఎస్ కావాలా..? ప్రజల పక్షాన నిత్యం ఉద్యమాలు చేస్తూ జైలుకు వెళ్లేందుకు వెనుకాడని బీజేపీ కావాలా..? తేల్చుకోవాలని ప్రజలను ఆయన కోరారు. చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళనంలో బండి సంజయ్ మాట్లాడారు.
"బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా దండు పాళ్యం ముఠా... వీళ్లందరినీ ఎలక్షన్ల దాకా తన పక్కనే పెట్టుకుంటడు.. చివర్లో ఇందులో సగం మందికి టిక్కెట్లు ఇయ్యడు.. కాంగ్రెస్‌లోనే 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు కేసీఆరే పంపిండు.. గెలవగానే వాళ్లు బీఆర్ఎస్‌లోకి జంప్ అవుతారు. గెలిచినా పార్టీ మారనోళ్లు బీజేపీ వాళ్లు మాత్రమే.. దళితుల పొట్ట కొట్టిన దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రంలో 12 మంది దళితులకు గవర్నర్ పదవులిస్తే.. కేసీఆర్ దళితులకు చేసిందేమిటి..? ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మాట తప్పాడు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట తప్పిండు.. దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం, కేసీఆర్ కుటుంబానికి 30 శాతం వెరసి కారు.. సారు.. 60 శాతం సర్కార్‌గా మారింది..
అంబేద్కర్ రాజ్యాంగాన్ని, విగ్రహాన్ని అవమానించిన ఘనుడు కేసీఆర్. మేం అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నిలదీస్తే.. మీరు ప్రారంభించకుంటే.. బీజేపీ అధికారంలోకి రాగానే విగ్రహం ప్రతిష్టిస్తామని హెచ్చరిస్తే భయపడి పనులు మొదలుపెట్టి ప్రారంభించాడు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ ది. దళితులు, అణగారినవర్గాల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తే... ఆనాటి నెహ్రూ అవమానించారు. వెంటనే కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ఆయనను కుట్ర చేసి అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దే. అంబేద్కర్ ను దేవుడిగా కొలుస్తున్న పార్టీ బీజేపీ. పంచ్ తీర్థాలను ఏర్పాటు చేసి అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తీసుకెళుతోంది..
కేసీఆర్, ఆయన కుటుంబం ఏం చేసింది. వాళ్లపై కేసులున్నాయా? ఉద్యమకారుల త్యాగాలతో అధికారమెక్కి తెలంగాణ ద్రోహల పార్టీగా మారారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి? మీకోసం కొట్లాడి జైలుకైనా వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీకి ఓటేస్తారా? మిమ్ముల్ని నట్టేట ముంచుతున్న బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..? ప్రజలంతా ఆలోచించాలి.." అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు.
Also Read: CM Jagan Mohan Reddy: 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి