IND vs IRE Dream11 Prediction Today: క్లీన్‌స్వీప్‌కు బుమ్రా సేన రెడీ.. డ్రీమ్‌ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఇలా..!

India vs Ireland Dream11 Tips and Pitch Report: క్లీన్‌స్వీప్‌పై బుమ్రాసేన కన్నేసింది. తొలి రెండు టీ20ల్లో ఐర్లాండ్‌ను ఓడించిన భారత్.. మూడో మ్యాచ్‌లో ఓడించేందుకు రంగంలోకి దిగుతోంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాను నిలువరించేందుకు ఐర్లాండ్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ఒక మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలని భావిస్తోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 23, 2023, 12:43 PM IST
IND vs IRE Dream11 Prediction Today: క్లీన్‌స్వీప్‌కు బుమ్రా సేన రెడీ.. డ్రీమ్‌ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఇలా..!

India vs Ireland Dream11 Tips and Pitch Report: ఐర్లాండ్‌పై తొలి టీ20 మ్యాచ్‌లు నెగ్గిన టీమిండియా.. చివరి మ్యాచ్‌ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో కుర్రాళ్లు అదగొడుతున్నారు. బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. తొలి మ్యాచ్‌కు వరుణుడు ఆటంక కలిగించగా.. రెండో మ్యాచ్ సాఫీగా సాగింది. అయితే మూడో మ్యాచ్‌కు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండడంతో మ్యాచ్ ప్రారంభానికి వర్షం పడే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించగా..  రెండో మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. డబ్లిన్‌లోని ది విలేజ్‌ వేదికగా బుధవారం రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి..? రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరు ఉంటారు..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..

పిచ్ రిపోర్ట్ ఇలా..

డబ్లిన్‌లోని ది విలేజ్‌ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకారం అందిస్తుంది. అయితే పిచ్ కాస్త నెమ్మదిగా ఉండడంతో పరుగులు రాబట్టడం కష్టమవుతోంది. రెండో టీ20లో కూడా టీమిండియా 18 ఓవర్ల పాటు వేగంగా పరుగులు చేయకపోయింది. అయితే చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు పిండుకోవడంతో స్కోరు బోర్డు 180 దాటింది. ఈ మ్యాచ్‌లో కూడా హైస్కోరింగ్ గేమ్ చూసే అవకాశం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.

వేదిక: డబ్లిన్‌లోని ది విలేజ్‌
సమయం: రాత్రి 7.30 గంటల నుంచి
స్ట్రీమింగ్ వివరాలు: స్పోర్ట్స్-18 నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జియో సినిమా యాప్‌లో కూడా చూడొచ్చు.

ప్లేయింగ్ ఎలెవన్ ఇలా.. (అంచనా)

భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ/సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, షాబాజ్ అహ్మద్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్/ముఖేష్ కుమార్. 

ఐర్లాండ్: రాస్ అడైర్, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్‌బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), కర్టిస్ క్యాంపర్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, థియో వాన్ వూర్కోమ్, బెంజమిన్ వైట్.

డ్రీమ్11 టీమ్ టిప్స్..

వికెట్ కీపర్: ఎల్.టక్కర్

బ్యాట్స్‌మెన్: పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ (కెప్టెన్), తిలక్ వర్మ

ఆల్ రౌండర్లు: కర్టిస్ కాంఫర్

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, బారీ మెక్‌కార్తీ

Also Read: Minister Harish Rao: అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ మొదటి సభ.. మెదక్‌లో ప్రగతి శంఖారావం: మంత్రి హరీశ్ రావు  

Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News