BJP national working committee meetings in Hyderabad on July 2nd: తెలంగాణలో కమలం పార్టీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలు సైతం తెలంగాణపైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ముఖ్య నేతలు పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సారి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు ఇతర నేతలు పాల్గొననున్నారు. ఇందులో పలు కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకోనున్నారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు స్కెచ్‌లు వేస్తున్నారు.


పనిలో పనిగా తెలంగాణలో పాగా వేయాలని యోచిస్తున్నారు. ఈక్రమంలోనే జులై 3న హైదరాబాద్‌లో రాష్ట్ర బీజేపీ నేతలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. సభను సక్సెస్ చేసేందుకు కమలనాథులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్లు వేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు హాజరయ్యేలా పక్కా ప్రణాళికలు వేస్తున్నారు.


ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీ కార్య వర్గ సమావేశాలు సక్సెస్ చేస్తామంటున్నారు. ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇందు కోసం విరాళాలు సేకరిస్తున్నామని..కేవలం డిజిటల్ పేమెంట్‌ల రూపంలో నగదు సేకరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 


Also read:Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల  స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!


Also read:Supreme Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త..సుప్రీం కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook